పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించాలని తాజాగా నిర్ణయం తీసుకుందట ముద్దుగుమ్మ రష్మికా మండన్నా. కన్నడ హీరోతో ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తెలుగులో బిజీయెస్ట్ హీరోయిన్ అయిపోయింది. బిజీతో పాటు లక్కీ బ్యూటీగా క్రేజ్ సంపాదించేసుకుంది. వరుసగా రెండు హిట్స్‌తో అమ్మడు టాలీవుడ్‌లో పాతుకుపోయేలానే కనిపిస్తోంది. 'గీత గోవిందం' సినిమాతో అమ్మడి పేరు బాగా మార్మోగిపోతోంది.
ఇకపోతే త్వరలోనే పెళ్లి చేసుకోవాల్సి ఉంది ఈ ముద్దుగుమ్మ. ఎంగేజ్‌మెంట్ టైంలోనే రెండేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటానని భర్త దగ్గర మాట తీసుకుంది రష్మికా. ఆ మాట ప్రకారం పెళ్లి అయితే చేసుకుంటుందట. కానీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తానని చెబుతోంది. నిజానికి ఎంగేజ్‌మెంట్ టైంలో పెళ్లి తర్వాత యాక్టింగ్ సంగతిని అంత సీరియస్‌గా తీసుకోలేదట ఈ ముద్దుగుమ్మ. కానీ అనూహ్యంగా తెలుగులో ఈ ముద్దుగుమ్మకి వచ్చిన క్రేజ్‌తో పెళ్లి తర్వాత నటనను కొనసాగించాలని సీరియస్‌గా డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది.
పెళ్లి తర్వాత ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ సినిమాల్లో నటిస్తున్నారు. వారిలో ముఖ్యంగా అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. నటిగా గుర్తింపు తెచ్చే పాత్రలను ఎంచుకుంటోంది. అలా సమంత బాటలోనే తాను నడుస్తానని రష్మికా చెబుతోంది. సమంత తనకు రోల్ మోడల్ అంటోంది.
'గీత గోవిందం' సినిమా విజయం సాధించినందుకు సమంత, రష్మికాకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపింది.