'దిల్' రాజుని సక్సెస్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పాలి. సినీ రంగంలో ఎత్తుపల్లాలు మామూలే. కొన్ని పరాజయాలు ఎదురైనప్పటికీ కూడా 'దిల్' రాజు లక్కీ రాజుగానే కాదు, మెగా సక్సెస్‌ల రాజుగా కూడా చెలామణీ అవుతున్నారు. ఆయన ఏ సినిమా పట్టుకున్నా అది సూపర్ సక్సెస్ అనే అభిప్రాయం ముందు సినీ పరిశ్రమలోనూ, ఆ తర్వాత ప్రేక్షకుల్లోనూ కలుగుతుంది. సినిమా విడుదలయ్యాక ఫలితం సంగతి వేరే సంగతి. ఎంత గొప్పగా సక్సెస్ రేట్ ఉంటే ఈ స్థాయి గౌరవం 'దిల్' రాజుకి దక్కుతుంది? ఆయన మనసున్న మారాజు, అందుకే ఆయన 'దిల్' రాజు అంటారు సినీ పరిశ్రమలో. కొత్త దర్శకుల్ని సినీ పరిశ్రమకు పరిచయం చేయడమొక్కటే కాకుండా, ఆ సినిమాల నిర్మాణంలో తనదైన ముద్ర వేస్తారు. దర్శకులకు స్వేచ్ఛనిస్తారు, కథల ఎంపికలో తన ప్రత్యేకతను చాటుకుంటారు. సినిమా సెట్స్ మీదకు వెళ్ళేవరకు మాత్రమే దర్శకుడికి దిల్ రాజు సలహాలిస్తారట. సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత అందులో ఏమాత్రం వేలు పెట్టరట. దర్శకత్వం చేస్తారా? అనడిగితే, ఆ పని నాది కాదు. చెయ్యలేక కాదుగానీ, చెయ్యబోను. దర్శకత్వం జోలికి అస్సలు వెళ్ళను అని చెప్పేశారు 'దిల్' రాజు. రెండు మూడు సినిమాలు నిర్మించేసి, దర్శకుడిగా ట్రై చేసేద్దామనుకునేవారున్నారు ఇండస్ట్రీలో. ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసినా, పెర్‌ఫెక్ట్ జడ్జిమెంట్ అనే ఘనత ఉన్నా దర్శకత్వం వైపు వెళ్ళనంటున్న దిల్ రాజు నిజంగానే గ్రేట్.