జనవరి 12న 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్' ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన వీడియో క్లిప్పింగ్స్‌లో, పోస్టర్స్‌లో వరుణ్‌ని వెంకటేష్ బాగా డామినేట్ చేసేస్తున్నాడు. ఈ టైప్ క్యారెక్టర్స్ వెంకటేష్‌కి కొట్టిన పిండి. సీనియర్ హీరో కదా, తన ఎనర్జీతో, ఎక్స్‌పీరియన్స్‌తో జూనియర్ అయిన వరుణ్‌ని డామినేట్ చేస్తున్నాడు.
కానీ వరుణ్‌కి తొలి సినిమా నుండీ మెగా కాంపౌండ్‌లో డిఫరెంట్ హీరో అనే ట్యాగ్ ఉంది. అందుకే తనను తాను క్యారెక్టర్‌కి తగ్గట్లుగా మౌల్డ్ చేసేసుకోగలడు. ఇప్పుడు వెంకటేష్‌కి తోడల్లుడుగా 'ఎఫ్ 2'లో కూడా అలాగే మౌల్డ్ అయిపోయాడు. అయితే వెంకీతో సమానంగా మార్కులేయించుకున్నాడా.? లేదా.? అనేది తెలియాంటే మాత్రం సినిమా విడుదలయ్యేంతవరకూ ఆగాల్సిందే. ఏది ఏమైనా ఈ ఇద్దరు తోడల్లుళ్లు ఈ సంక్రాంతిని నవ్వుల పండగలా మార్చేయడం ఖాయమనిపిస్తోంది.
ఇదిలా ఉంటే, ప్రమోషన్స్‌లో మరింత వేగం పెంచనున్నారట. ఇప్పటికే సాంగ్ ప్రోమోస్, టీజర్స్, పోస్టర్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక కొన్ని ఫన్నీ డైలాగ్స్‌ని కూడా వదిలి సినిమాపై అంచనాలు పెంచేయనున్నారట. ఫన్‌తో పాటు, ఇద్దరు ముద్దుగుమ్మలు తమన్నా, మెహ్రీన్‌ల డబుల్ గ్లామర్ ఈ సినిమాకి మరో హైలైట్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు నిర్మించారు.