'డిస్కోరాజా' టీజర్‌ టాక్‌: రవితేజకు మళ్లీ డిజార్డరా.?

By Inkmantra - January 13, 2020 - 16:47 PM IST

మరిన్ని వార్తలు

'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'లో పేరెందుకులెండి.. అదేదో డిజార్డర్‌ అంటూ ప్రీ రిలీజ్‌ ముందు ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేసి, తీరా విడుదలయ్యాకా, బోర్‌ కొట్టించేశాడు మాస్‌ రాజా రవితేజ. ఇప్పుడు 'డిస్కోరాజా' సినిమాతో రాబోతున్నాడు. విలక్షణ దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ ఈ సినిమాకి దర్శకుడు. డిశంబర్‌లో ఈ సినిమాకి సంబంధించి ఓ టీజర్‌ రిలీజైన సంగతి తెలిసిందే. ఓకే అనిపించుకుంది ఆ టీజర్‌ టాక్‌. ఇప్పుడు మరో టీజర్‌ రిలీజ్‌ చేశారు. ఈ టీజర్‌లో ఓ డిజార్డర్‌ గురించి మాట్లాడుతున్నారు. పోస్ట్‌ వార్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ అట.

 

'సోల్జర్సు సంవత్సరాల పాటు బాంబింగ్స్‌తోనూ, ఫైరింగ్స్‌తోనూ యుద్ధాలు చేసి, రిటైరయ్యి ఇంటికొచ్చాక సెడన్‌గా వచ్చే సైలెన్స్‌ ఉంటది చూడు.. అదప్పటి దాకా వాళ్లు చేసిన వయెలెన్స్‌ కన్నా భయంకరంగా ఉంటది.. ' అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లో ఓ వాయిస్‌ వినిపిస్తోంది. మరి దానికి మందేదీ లేదా డాక్టర్‌.?' అంటూ బ్యాక్‌ గ్రౌండ్‌లోనే రవితేజ వాయిస్‌ వినిపిస్తుంది. అప్పుడు మన రవితేజ డిస్కోరాజాలా ఎంట్రీ ఇస్తాడు. ఫస్ట్‌ టీజర్‌లో ఓ రకమైన క్యూరియాసిటీ చూపించాడు.

ఈ టీజర్‌లో మరో రకమైన క్యూరియాసిటీ. టోటల్‌గా 'డిస్కోరాజా'తో వి.ఐ.ఆనంద్‌ ఏదో ఇంట్రెస్టింగ్‌ నేపథ్యాన్ని చెప్పే ప్రయత్నమైతే చేస్తున్నాడు. అదేంటో తెలియాలంటే జనవరి 24 వరకూ ఆగాల్సిందే. అప్పుడే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ సింహా విలన్‌గా నటిస్తున్నాడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS