యాక్షన్ ఎపిసోడ్స్‌కి ప్రబాస్ కటౌట్ పర్‌ఫెక్ట్ ఫిట్ అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కొరటాలతో ప్రబాస్ చేసిన 'మిర్చి' అంతకుముందు వచ్చిన 'ఛత్రపతి' తదితర సినిమాలు ఆ విషయాన్ని ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి' ఆ విషయంలో ప్రబాస్ స్థాయిని దేశ దేశాల ఖ్యాతి పొందేలా చేసింది.
'బాహుబలి'తో యూనివర్సల్ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రబాస్ తదుపరి చిత్రం కూడా అదే స్థాయిలో అంతకు మించిన స్థాయిలో ఉండడం విశేషం. అదే 'సాహో' చిత్రమండి. నిజానికి ఈ సినిమాని తెరకెక్కించేది చిన్న డైరెక్టర్ అయితన సుజిత్. కానీ 'బాహుబలి'తో పెరిగిపోయిన ప్రబాస్ స్థాయికి ఈ సినిమా అంచనాలు తారుమారయ్యాయి. ఏదో మినిమమ్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కిద్దామనుకున్న ఈ సినిమా కాస్తా, దాదాపు 200 కోట్ల పైబడిన బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కాస్ట్‌లీ అండ్ రిచ్ లొకేషన్స్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ముంబయ్, అబుదాబి, దుబాయ్, యూరప్ వంటి కంట్రీస్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ అన్నీ హాలీవుడ్ నటుడు కెన్నీ బేట్స్ పర్యవేక్షణలో జరుగుతుండడం విశేషం. అదీ ప్రబాస్ స్థాయి.
తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ భామ శ్రద్దాకపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా, నీల్ నితీష్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇంకా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.