యంగ్ హీరో నిఖిల్ వెరైటీ సినిమాలు చేస్తూ కెరీర్‌లో దూసుకెళుతున్నాడు. ఈ యంగ్ హీరో తాజా చిత్రం 'కేశవ'. చాక్లెట్ బోయ్‌లా లవ్ స్టోరీస్‌కే ఎక్కువ ప్రిపరెన్స్ ఇచ్చిన నిఖిల్, గత కొంతకాలంగా వరుస పెట్టి రొటీన్‌కి భిన్నంగా సినిమాల్ని ఎంచుకుంటున్నాడు. మార్చిన రూటు నిఖిల్‌కి బాగా కలిసొచ్చింది. వరుసగా సక్సెస్‌లు అందుకుంటున్నాడు. తాజాగా 'కేశవ' సినిమాతో ఇంకో ప్రయోగం చేస్తున్నాడని టీజర్‌ని చూస్తే అర్థమవుతుంది. ఇదొక రివెంజ్ డ్రామా. 'రివెంజ్ ఈజ్ ఎ డిష్ - బెస్ట్ సెర్వ్‌డ్ కోల్డ్' అని పేర్కొంటూ టీజర్‌తో సందడి చేశాడు 'కేశవ'గా నిఖిల్. టీజర్‌కి సినీ పరిశ్రమ నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తోనే చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు నిఖిల్. ఇప్పుడు టీజర్‌తో మరింత ఆశక్తి పెంచేస్తున్నాడు. అసలు ఈ సినిమాతో నిఖిల్ ఏం చేయబోతున్నాడనే ఆశక్తి నెలకొంది. అంత ఆలోచింపచేసే విధంగా ఉంది మరి టీజర్. ఈ చాక్లెట్ బోయ్ ఏంటి ఆ రక్తపాతం ఏంటి అనుకుంటూనే..సినిమాలో ఏదో విషయం ఉందనిపించేలా ఉంది టీజర్ చూస్తుంటే, ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ భామ ఇషా కొప్పికర్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమా ఇది. టీజర్‌లో రక్తపాతం ఎక్కువగా ఉన్నా డిఫరెంట్‌గా టీజర్‌ని కట్ చేసిన తీరు ఆకట్టుకుంటోంది.