సిద్ధు జొన్నలగడ్డ పదేళ్లుగా ఇండస్ట్రీలో వున్నాడు. కానీ సరైన బ్రేక్ మాత్రం 'డిజె టిల్లు’ తోనే పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ చిత్రాల జాబితాలో చేరింది. సెకండ్ హాఫ్ వీక్ గా వుందనే టాక్ వచ్చినా.. డిజే టిల్లు తన మ్యానరిజం డైలాగ్ డిక్షన్ తో సినిమాని హిట్ జాబితాలో చేర్చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ వెంటనే ‘డిజె టిల్లు’కి సీక్వెల్ కూడా ప్రకటించింది. స్క్రిప్ట్ చివరి దశకు చేరుకుంది. ఆగస్ట్‌లో షూటింగ్ మొదలు కాబోతున్న తరుణంలో ఊహించని విధంగా ఈ సినిమా నుంచి దర్శకుడు విమల్ తప్పుకున్నట్లు సమాచారం.
హీరో సిద్ధు జొన్నలగడ్డతో డిఫరెన్సెస్ వల్లనే దర్శకుడు విమల్ సీక్వెల్ నుండి తప్పుకున్నట్లు టాక్. 'డిజె టిల్లు’ టిల్లులో మేజర్ హైలెట్ డైలాగ్స్. హీరో బాడీ లాంగ్వేజ్. సిద్దునే ఈ సినిమాకి డైలాగ్స్ రాసుకున్నాడు. ఆ డైలాగ్స్ బాగా పేలాయి. 'డిజె టిల్లు’ సీక్వెల్ కి వచ్చేసరికి స్క్రిప్ట్ లో సిద్దు జోక్యం ఎక్కువైయిందని తెలిసింది.
సిద్దు, విమల్ మధ్య కోల్డ్ వార్ నడిచింది. నిర్మాతలు సిద్దు పక్షానే ఉన్నారట. చాలా క్రియేట్ ఇన్ పుట్స్ విషయంలో దర్శకుడి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. దీంతో విమల్ ఇక ప్రాజెక్ట్ నుండి బయటికి వచ్చేశాడని తెలిసింది. ప్రస్తుతం మరో దర్శకుడి కోసం చూస్తున్నారు నిర్మాతలు.