నాని కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న చిత్రం `శ్యామ్ సింగరాయ్`. సాయి పల్లవి, కృతి శెట్టి కథానాయికలు. రాహుల్ సంకృత్యయిన్ దర్శకుడు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం నారా రోహిత్ పేరుని పరిశీలిస్తున్నట్టు టాక్. ఈమధ్య నారా రోహిత్ సినిమా ఏదీ మొదలు కాలేదు. కొన్ని సినిమాల్లో.. కీలకమైన పాత్ర కోసం నారా రోహిత్ ని సంప్రదించినా `నో` చెప్పాడు.
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `పుష్ష` లోని ఓ పాత్ర కోసం రోహిత్ ని సంప్రదిస్తే.. సున్నితంగా తిరస్కరించినట్టు టాక్ వినిపించింది. బన్నీ అడిగితే కాదన్న రోహిత్...నాని అడిగితే ఒప్పుకుంటాడా? అన్నదే సందేహం. అయితే.. ఇది వరకు నారా రోహిత్ - నాగశౌర్యలు నటించిన `జ్యో అత్యుతానంద` చిత్రంలో ఓ అతిథి పాత్రలో కనిపించాడు నాని. అందుకే ఇప్పుడు రోహిత్ కూడా ఒప్పుకునే అవకాశాలున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి రోహిత్ ఏమంటాడో చూడాలి.