అల్లు అర్జున్ 'రేసుగుర్రం' సినిమాకి విడుదలకి ముందే హిట్ టాక్ వచ్చింది, అలాగే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 'సన్ ఆఫ్ సత్యమూర్తి' బాగానే ఉందిగానీ అనే టాక్ సంపాదించుకుంది. వసూళ్ళు మాత్రం అదరగొట్టేసింది ఆ సినిమా. 'సరైనోడు' అయితే అబ్బే, మాస్ సినిమానేగానీ హిట్టయ్యే కళ తక్కువన్నారు, అల్లు అర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది 'సరైనోడు' సినిమా. ఈ మూడు సినిమాలూ అల్లు అర్జున్ స్టామినాని తెలియజేశాయి. సినిమా సినిమాకీ బాక్సాఫీస్ స్టామినా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అల్లు అర్జున్. లేటెస్ట్ మూవీ 'డిజె దువ్వాడ జగన్నాథమ్' కూడా అంతే. బంపర్ విక్టరీ సొంతం చేసుకుంది టాక్‌కి భిన్నంగా. ఈ వసూళ్ళు చూసి సినీ ట్రేడ్ పండితులే షాక్‌కి గురవుతున్నారు. మరో పక్క సోషల్ మీడియాలో అల్లు అర్జున్‌కి నెగిటివ్‌గా వసూళ్ల విషయంలో విమర్శలు వస్తున్నాయి. ఈ రకంగా సినిమాపై వస్తున్న విమర్శలకు హరీష్ శంకర్ ఘాటుగానే స్పందిస్తున్నాడు. ఏదేమైనా వసూళ్ళే కదా ఇప్పుడు సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది. బన్నీ ఈ సినిమాతో 100 కోట్లు, 150 కోట్లు క్లబ్‌లోకి వెళ్లిపోవడం ఖాయమే అనిపిస్తోంది. కాబట్టి టాక్‌తో సంబంధం లేకండా బన్నీ కెరీర్‌లో మరో బంపర్ హిట్ పడిందన్నమాటే 'డీజె'తో. బన్నీ మామూలోడు కాదండోయ్. ఈ సినిమాలో ముద్దుగుమ్మ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటించింది. ఈ బ్యూటీ గ్లామర్ కూడా సినిమా విజయానికి దోహదం చేసిందనడంలో అతిశయోక్తి కాదు.