దువ్వాడ జగన్నాధం కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ స్టామినాని తెలియచేస్తున్నది.
రిలీజ్ అయిన మూడురోజుల్లో సుమారు రూ 66 కోట్ల గ్రాస్ ని ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది. అందులో ఒక్క నైజాం ఏరియాలోనే రూ 10 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ37 కోట్ల షేర్ ని వసూలు చేసి బన్నీ కెరీర్ లోనే అత్యుత్తమ రికార్డుగా నిలిచింది.
USAలోను దువ్వాడ జగన్నాధం హవా కొనసాగుతున్నది. మొత్తంగా, మిక్స్డ్ టాక్ తో మొదలయినా ఈ చిత్రానికి కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకు ఎటువంటి ఎఫెక్ట్ కనపడలేదు.
నాలుగవ రోజు అయిన ఈ రోజు కూడా సెలవుదినం కావడంతో, దువ్వాడ జగన్నాధం కలెక్షన్స్ బాగా పెరిగే అవకాశం ఉన్నట్టు అర్ధమవుతుంది.