సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రాకముందే ఆయనని రాజకీయ నాయకులు టార్గెట్ చేయడం మొదలుపెట్టేశారు.
వివరాల్లోకి వెళితే, బీజీపీ సీనియర్ నాయకుడైన సుబ్రహ్మణ్య స్వామి ఈ మధ్యనే రజినీకాంత్ ని ఆర్ధిక నేరగాడు అలాగే అటువంటి వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.
దీనిపై ఆయన అభిమానులు తమిళనాట తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ అభిమాన నటుడు మాటకి కట్టుబడి ఎటువంటి తీవ్ర నిర్ణయాలు తాము తెసుకోవడం లేదని లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరిస్తున్నారు.
అయితే వీటి పై రజని ఇంకా స్పందించకపోయినా ఆయన అభిమానులు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.