గ్లామ్‌షాట్‌: ఊహా లోకంలో 'ఈషా' గానం.!

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయి ఈషా రెబ్బకి అసలు సిసలు బ్రేక్‌ ఎప్పుడొస్తుందో ఏమో కానీ, ఆ అదృష్టం కోసమే ఎదురుచూస్తున్నానంటోంది. చూశారుగా, ఊహా లోకంలో అతిలోక సుందరిలా ఎలా ఆలోచిస్తోందో. ఖాళీగా లేదు కానీ, వచ్చిన అవకాశాన్ని బాగానే ఉపయోగించుకుంటోంది ముద్దుగుమ్మ ఈషారెబ్బా.

 

అయితే సోలో హీరోయిన్‌గా స్టార్‌ హీరోల సరసన ఛాన్సెస్‌ దక్కించుకోవాలనేదే ఈషా కోరిక. అఫ్‌కోర్స్‌.! ఏ హీరోయిన్‌కైనా ఇదే కోరికుంటుందిలెండి. తప్పు లేదు. కానీ టైం కలిసి రావాలి కదా. టాలెంట్‌ ఎంతున్నా, ఎవ్వరైనా ఆ టైం కోసం వెయిట్‌ చేయాల్సిందే. ఇదిలా ఉంటే, మన తెలుగమ్మాయి తన ఇన్‌స్టాలో తాజాగా ఓ పిక్‌ పోస్ట్‌ చేసింది.

 

షార్ట్‌ జీన్స్‌లో క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపిస్తున్న ఈషా మనసులో ఎంతో సంతోషంగా ఉందట. ఎందుకో ఆ సంతోషం ఆమెకే తెలియాలి. పిక్‌ విషయానికి వస్తే, సూపర్బ్‌ స్టైలిష్‌ లుక్‌ ఇది. చేతికి ఉన్న టాటూ, డిఫరెంట్‌ హెయిర్‌ స్టైల్‌ ఆమె అందానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. మన తెలుగందాన్ని ఓసారి చూసి ఓ లైకేస్కోండి బాబూ.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS