'కథానాయకుడు' 20 కోట్లు వచ్చింది. 'మహానాయకుడు' కనీసం 5 కోట్లు కూడా దాటేలా కనిపించడం లేదు. తెలుగు సినిమా చరిత్రలో ఓ స్టార్ హీరో సినిమా ఈ స్థాయిలో డిజాస్టర్ కావడం ఇదే తొలిసారి. దీన్ని అతిపెద్ద అవమానంగా భావిస్తున్నారు కొందరు. స్వర్గీయ ఎన్టీఆర్‌కి కోట్లాది మంది అభిమానులున్నారు. అభిమానులు ఆదరించినా ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించే అవకాశం ఉంది. అలాంటిది వాళ్లు కూడా ఈ సినిమాని లైట్ తీసుకోవడం నిజంగా పెద్దాయనకు జరిగిన అవమానంగానే భావించాలి.
మరోవైపు ఆయన్ని ఇంకా అమితంగా అభిమానించేవాళ్లు.. అసలు 'కథానాయకుడు', 'మహానాయకుడు' ఎన్టీఆర్ బయోపిక్సే కాదు, కేవలం ఆయన భార్య బసవతారకం బయోపిక్స్ మాత్రమే అని సరిపెట్టుకుంటున్నారు. ఈ యాంగిల్‌లో సరిపెట్టుకుని కాస్తైనా ఈ అవమానం నుండి ఊరట పొందుతున్నారనుకోవాలి. ఇదిలా ఉంటే, ఈ సినిమాకి దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు క్రిష్ పేరు కూడా పెద్దగా వినిపించింది లేదు.
'కంచె', 'కృష్ణం వందే జగద్గురుమ్', 'గౌతమీ పుత్ర శాతకర్ణి' వంటి టఫ్ సబ్జెక్ట్స్‌ని ఎంచుకుని సక్సెస్‌తో పాటు, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న క్రిష్ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ బయోపిక్ అంటే అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ అంచనాలు ఇలా తారుమారయ్యేసరికి క్రిష్‌కి కూడా పరస్థితి అర్ధం కావడం లేదు. 'కథానాయకుడు' రిజల్టే 'మహానాయకుడు' భవితవ్యం చెప్పేసినా, రిస్క్ చేసి బాలయ్య ఈ సినిమాని విడుదల చేశారు. కానీ ఆ రిస్క్ ఫలించలేదు. వీకెండ్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక వీక్ డేస్‌లో 'మహానాయకుడు' వసూళ్లపై అంచనాలు, అవకాశాలు ఏమాత్రం పోజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేం.