గ్లామ్‌షాట్‌: అమాయకంగా చూసి.. అందాలేమో ఆరేసి.!

By Inkmantra - March 29, 2019 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

తెలుగమ్మాయిలు గ్లామర్‌కి దూరమని అంత తేలిగ్గా అంచనా వేయకూడదండోయ్‌. చూస్తున్నారుగా ఈ పిక్‌లో ఈషా రెబ్బ. కంచెలన్నీ తెంచేసింది. కాస్త లేటుగానే ప్లాన్‌ చేసినా కరెక్ట్‌గా ప్లాన్‌ చేసింది. టాలెంట్‌ ఉన్నా, అవకాశాలు రాకపోయేందుకు కారణం ఇదేనా.? ఈ గ్లామరేనా.? అయితే చూసుకోండి, తెలుగందంలోని కిక్‌ ఏంటో.. అంటూ సవాల్‌ విసిరినట్లుగా ఉన్నాయి ఈ హాట్‌ పిక్స్‌. క్లీవేజ్‌ని ఆవగా ఆరేసి, ఫేస్‌లో అమాయకపు ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చింది. 

 

హైటు, వెయిటూ, ఫిగర్‌ కరెక్ట్‌గా ఉండే ఈషా రెబ్బ చేసిన ఈ సాహసం తనతో పాటు, ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు వెల్లువెత్తడంలో ఎంత మేర సాయం చేస్తుందో చూడాలిక. ఇటీవల 'బ్రాండ్‌ బాబు'లో సోలో హీరోయిన్‌గా మెప్పించి, 'అరవింద సమేత'లో హీరోయిన్‌కి చెల్లి పాత్రలో కనిపించి కవ్వించినా, ఆ తర్వాత మరో అవకాశం దక్కించుకోలేకపోయింది. చూద్దాం కనీసం ఈ హాట్‌ సెగల హవా అవకాశాల్ని ఎంతవరకూ తాకుతుందో.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS