ఎన్నో వివాదాలు, సస్పెన్స్‌ల మధ్య ఎట్టకేలకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆంధ్ర్రప్రదేశ్ కోర్టు స్టే మేరకు ఏపీలో తప్ప ఈ సినిమా తెలంగాణాతో పాటు, ఓవర్సీస్‌లోనూ సాఫీగా విడుదలయ్యింది. హైద్రాబాద్‌లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలకు ఎలాంటి సమస్యలూ లేని కారణంగా ఈ రోజు ఉదయం 8.45 గంటలకు ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో మొదటి షో వేసేశారు. ఆ తర్వాత రెగ్యులర్ టైమింగ్స్‌లో షోలు కొనసాగుతున్నాయి.
ఇక ఏపీ రిలీజ్‌కి సంబంధించి ఏప్రిల్ 3న సినిమా చూసి చెబుతామన్న మంగళగిరి కోట్టు స్టేపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నామని వర్మ తెలిపారు. మరోవైపు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసాద్ ల్యాబ్‌లో వర్మ ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఏపీ కోర్టు స్టేకి సంబంధించిన విషయాలను మీడియా ముఖంగా తెలపనున్నారు. మొత్తానికి ఎంత పెద్ద రచ్చ జరిగినా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'ని అయితే ప్రేక్షకుల్లోకి తీసుకొచ్చేశారు.
ఇక ఏపీ బిజినెస్ వ్యవహారమంటారా.? అంతకుమించిన సంతృప్తిని తెలంగాణా, ఓవర్సీస్ రిలీజ్ ద్వారా పొందేశారు రామ్‌గోపాల్ వర్మ. ఫస్ట్ షోతోనే టాక్ అదిరిపోతోంది. ఈ టాక్ ప్రభావం ఖచ్చితంగా ఏపీపై ఉండకపోదు. దటీజ్ రామ్‌గోపాల్ వర్మ. ఇక ప్రెస్ మీట్‌లో వర్మ ఏం చెప్పబోతున్నారో చూడాలిక.