చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలే బుల్లితెరను ప్రత్యేకంగా చూస్తున్న రోజులివి. యంగ్ హీరోలు ఎన్టీఆర్, రానా తదితరులు బుల్లితెరపై హవా చూపిస్తున్నారు. అలాంటిది బుల్లితెర నుండి వెండితెరదాకా ఎదిగిన నేనెందుకు బుల్లితెరను వదిలిపెడతానంటున్నాడు బుల్లితెర హీరో ప్రభాకర్. ప్రస్తుతం ప్రభాకర్ వెండితెరను అలంకరించబోతున్నాడు. డైరెక్టర్‌గా మారి, వెండితెరపై సినిమాలు చేస్తున్నాడు. 'నెక్ట్స్ నువ్వే' టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. బుల్లితెర హాట్ బ్యూటీ రేష్మీ హీరోయిన్గా నటిస్తోంది. ఇది కాక మరో రెండు సినిమాలనూ డైరెక్ట్ చేస్తున్నాడు ప్రభాకర్. సో వెండితెరపై సినిమాల డైరెక్షన్‌తో బిజీ అయిపోయిన కారణంగా ఇక బుల్లితెరకు టాటా బై బై చెప్పేస్తాడంటూ గాసిప్స్ వస్తున్నాయి. ఆ గాసిప్స్‌ని ప్రభాకర్ ఖండించాడు. అలాంటిదేం లేదనీ, బుల్లితెర తనకి తల్లివంటిదనీ అంటున్నాడు. ఎప్పటి నుండో డైరెక్టర్ కావాలనుకుంటున్నా తన కోరిక ఇప్పటికి తీరింది. అలా అని కన్నతల్లిలాంటి బుల్లితెరను విడిచిపెట్టేస్తానా? అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు ప్రభాకర్. అవును బుల్లితెరపై ప్రభాకర్‌కి సాధించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు మరి అలాంటిది ఎందుకు వదులుకుంటాడు? ఛాన్సే లేదు. అంతేకాదు బుల్లితెర నుండి వచ్చిన నటీనటులు ఎవరైనా ఇలాగే భావిస్తుంటారు. బుల్లితెర అభిమానం, బుల్లితెర ప్రాధాన్యత అలాంటిది. బుల్లితెర హాట్ బ్యూటీస్ అనసూయ, రేష్మీలు కూడా అంతే, సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నా, కానీ బుల్లితెర ప్రోగ్రాంస్ని మాత్రం విడిచి పెట్టడం లేదు. అదీ బుల్లితెర అంటే. బుల్లితెరనా మజాకానా!