సోషల్ మీడియాలో సెలబ్రిటీస్‌కి అప్పుడప్పుడూ తప్పుడు మెసేజ్‌లు రావడం, ఒక్కోసారి సెలబ్రిటీలు వాటికి ఘాటుగా రిప్లైలివ్వడం తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ మధ్య ఇవి కాస్త శృతి మించుతున్నాయి. పర్సనల్ ట్రోలింగ్స్‌కి కారణమవుతున్నాయి. దాంతో సెలబ్రిటీలు కూడా కాస్త దూకుడు ప్రదిర్శస్తున్నారు. మొన్నా మధ్య రకుల్ ప్రీత్‌సింగ్, అప్పుడప్పుడూ అనసూయ... తాజాగా యాంకర్ రష్మి గౌతమ్... ఓ నెటిజన్ తన తండ్రి నెంబర్ కావాలంటూ రష్మికి ఓ పోస్ట్ పెట్టాడు.
'ఓ యాడ్ షూట్ కోసం మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నాను. మీ నాన్న నెంబర్ మిస్ అయ్యింది. ఏమీ అనుకోకపోతే ఓ సారి మీ నాన్న నెంబర్ ఇస్తారా.'? అని పోస్ట్ పెట్టాడు. డౌట్ రాకుండా తన పీఆర్ మేనేజ్మెంట్ పేరు కూడా ట్విట్టర్లో పేర్కొన్నాడీ ప్రబుద్ధుడు. కానీ దొరికిపోయాడు. చిన్నప్పుడే అంటే సెలబ్రిటీ కాకముందే రష్మి తండ్రి చనిపోయారు. అలాంటప్పుడు రష్మి తండ్రి నెంబర్ ఆ నెటిజన్ దగ్గర ఎలా ఉంటుంది.? అడ్డంగా దొరికిపోయిన ఆ నెటిజన్‌కి ఘాటుగా రిప్లై ఇచ్చింది రష్మి. మీ లాంటి వాళ్ల వల్లే ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది.. అంటూ రష్మి స్పందించింది.