'పలానా అమ్మాయి పలానా అబ్బాయి' అసలు కధేంటంటే.!

మరిన్ని వార్తలు

'అష్టా చెమ్మా' సినిమాతో ఆర్టిస్టుగా పరిచయమైన అవసరాల శ్రీనివాస్‌ తర్వాత 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. డైరెక్టర్‌గా తొలి సినిమాకే మంచి విజయం అందుకున్నాడు. ఆ తర్వాత 'జ్యో అచ్చుతానంద' సినిమాని తెరకెక్కించి మరో హిట్‌నీ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓ పక్క నటుడిగా సత్తా చాటుతూనే, మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా దర్శకుడిగానూ తన టాలెంట్‌ ప్రదర్శిస్తుంటాడ మనోడు. 

 

డైరెక్టర్‌గా తన రెండు సినిమాల్లోనూ యంగ్‌ హీరో నాగశౌర్యనే హీరోగా నటించాడు. ఇక ముచ్చటగా మూడో సినిమాకీ రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా నాగశౌర్యనే హీరోగా తీసుకుంటున్నాడు అవసరాల. నేచురల్‌ స్టార్‌ నానితో కలిసి ఎక్కువగా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నాడు. తన డైరెక్షన్‌లో నాని హీరోగా సినిమా రూపొందిస్తానని గతంలో చెప్పాడు. కానీ కథ సెట్‌ కావడం లేదట. ప్రస్తుతం సెట్‌ అయిన కథకీ నాగశౌర్యనే హీరోగా ఎంచుకోవడం విశేషం. 

 

కథ కూడా యూత్‌తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌నీ ఆకట్టుకునేలా ఉండబోతోందట. అవరసరాల సినిమాలకు ముఖ్యంగా టైటిల్స్‌ డిఫరెంట్‌గా ఉంటాయి. ఈ సినిమాకీ ఓ వినూత్న టైటిల్‌ని పరిశీలిస్తున్నాడట. అది 'పలానా అమ్మాయి పలానా అబ్బాయి' అనే టైటిల్‌ అనీ తెలుస్తోంది. అంటే టైటిల్‌ని బట్టి ఇది కూడా ఓ క్యూట్‌ లవ్‌స్టోరీ అయ్యుంటుందని భావించొచ్చు. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. మరోవైపు అవసరాల ప్రధాన పాత్రలో 'ఎన్నారై - నాయనా.! రారా ఇంటికి' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS