'ఆర్‌ఆర్‌ఆర్‌'పై క్లారిటీ ఇవ్వనున్న జక్కన్న: ఓపెన్‌ అయ్యేదెప్పుడంటే.!

మరిన్ని వార్తలు

'బాహుబలి' సినిమాతో ప్రపంచమంతా తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసిన రాజమౌళి తదుపరి తెరకెక్కించబోయే చిత్రం కూడా భారీ చిత్రమే. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి స్టార్‌లతో మల్టీస్టారర్‌ని రూపొందించబోతున్నాడు. అదే 'ఆర్‌ఆర్‌ఆర్‌'. అయితే ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్‌ అయిన రోజు నుండీ ఈ సినిమాపై పలు రకాల గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. కానీ చిత్ర యూనిట్‌ కానీ, రాజమౌళి కానీ ఆ గాసిప్స్‌ని ఖండించే ప్రయత్నం చేయలేదింతవరకూ. 

 

అయితే మార్చి 14న ఈ గాసిప్స్‌పై రాజమౌళి పెదవి విప్పనున్నారట. వస్తున్న గాసిప్స్‌కి ఇక చెక్‌ పెట్టేయనున్నారట. ఆ రోజు రాజమౌళి స్పెషల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి, సినిమాపై ఆడియన్స్‌లో ఉన్న అన్ని రకాల డౌట్స్‌పైనా క్లారిటీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. బ్రిటీష్‌ కాలం నాటి కథగా రూపొందుతోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్‌ పాత్ర ఇదీ అనీ, ఎన్టీఆర్‌ పాత్ర అదీ అని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. 

 

ఇప్పుడా రూమర్స్‌లో నిజమెంతుందో కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ రాజమౌళి ద్వారా తెలిసిపోనుంది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యి రెండు షెడ్యూల్స్‌ కూడా కంప్లీట్‌ చేసుకుంది. కానీ ఇంతవరకూ హీరోయిన్స్‌ వివరాలు తెలియ రాలేదు. అయితే హీరోయిన్స్‌ విషయమై తాజాగా ఓ క్లారిటీకొచ్చేశారట ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌. మార్చి 14న హీరోయిన్స్‌ పేర్లు కూడా అనౌన్స్‌ చేయనున్నారనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS