టాలీవుడ్ నిర్మాతగా దిల్ రాజు ప్రయాణంలో అత్యధిక లాభాల్ని అందించిన చిత్రంగా నిలిచింది 'ఎఫ్ 2'. తెలుగులో వంద కోట్ల (గ్రాస్) తెచ్చుకున్న చిత్రాలలో ఇదొకటి. వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఇప్పుడీ సినిమా బాలీవుడ్‌కి కూడా వెళ్లబోతోందని సమాచారం. అక్కడ కూడా దిల్‌రాజునే నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం బాలీవుడ్ నుంచి కొంతమంది నిర్మాతలు రీమేక్ హక్కుల కోసం దిల్‌రాజుని సంప్రదిస్తున్నార్ట. మరోవైపు తమిళ, కన్నడ, మలయాళ భాషల నుంచి కూడా నిర్మాతలు క్యూ కడుతున్నారని, అయితే దిల్‌రాజు మాత్రం ఈ విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని సమాచారం. ఈ చిత్రాన్ని మిగిలిన భాషల్లోనూ సొంతంగా తెరకెక్కించాలని దిల్ రాజు భావిస్తున్నారని తెలుస్తోంది.
అయితే.. నేరుగా బాలీవుడ్లో ఇప్పటికిప్పుడు సినిమా తీయడం కష్టం కాబట్టి, మరో బాలీవుడ్ నిర్మాతతో కలసి భాగస్వామిగా మారి, ఈ చిత్రాన్ని నిర్మించే ఆలోచనలో ఉన్నారట. ''ప్రస్తుతం కొంతమంది బాలీవుడ్ హీరోలు ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అన్నీ ఫైనల్ అయ్యాక... పూర్తి వివరాలు చెబుతాం'' అని దిల్‌రాజు ప్రకటించారు.