కొందరి గుప్పిట్లో థియేటర్లు.. ఏది నిజం.?

By iQlikMovies - January 09, 2019 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ థియేటర్ల గోల మొదలైంది. 'ఎన్‌టిఆర్‌ కథానాయకుడు', 'వినయ విధేయ రామ', 'ఎఫ్‌2' సినిమాలతోపాటుగా ఈ సంక్రాంతికి 'పేట' సినిమా కూడా ప్రేక్షకుల ముందుకొస్తోంది. అయితే, 'పేట' అనుకోకుండా సంక్రాంతి రేసులోకి వచ్చిన సినిమా. మిగతా మూడు స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు, ఆరు నెలల క్రితమే రిలీజ్‌ డేట్‌ని కన్‌ఫామ్‌ చేసుకున్నాయి. 

 

కానీ, డబ్బింగ్‌ రైట్స్‌ తీసుకున్న నిర్మాత, 'పేట' సినిమాకి థియేటర్లను ఇవ్వడంలేదంటూ వివాదాస్పద, జుగుప్సాకర వ్యాఖ్యల్ని కొందరిపై చేస్తున్నారు. దానికి ప్రముఖ నిర్మాత 'దిల్‌ రాజు', మరో నిర్మాత బన్నీ వాసు గట్టిగానే సమాధానమిచ్చారు. సమస్య ఎదురైతే, దాన్ని సినీ పరిశ్రమలో వుంచి, పరిష్కారం కోసం చూడాల్సింది పోయి, కొందరి గుప్పిట్లో థియేటర్లు వున్నాయంటూ మిడిమిడి జ్ఞానంతో ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా మారింది. 

 

అసలు థియేటర్లు ఎవరి గుప్పిట్లో వున్నాయి? అది నిజమేనా? కాదా? అనే విషయమై ప్రముఖ పీఆర్‌వో ఏలూరు శ్రీను స్పందన ఎలా వుందో చూద్దాం. 

 

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఎవ‌రి ద‌గ్గ‌ర వున్నాయి...

 

ప్ర‌తిసారి చిన్న సినిమా పెద్ద సినిమా విడుద‌ల అయ్యే టైంలో కొంత మంది వ‌చ్చి మాకు థియేటర్స్ ఆ న‌లుగురు ఇవ్వ‌టం లేదు అనే నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అస‌లు ఎవ‌రి చేతిలో థియేటర్స్ వున్నాయ‌ని తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌టంలేదు. ఆ వివ‌రాల్లోకి వెలితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న స్క్రీన్స్ 1170 (మ‌ల్టిప్టెక్స్ తో క‌లిపి). ఇక్క‌డ(తెలంగాణలో) అల్లు అరవింద్ గారికి సంబందించినవి.. నైజాం లో 3 థియేటర్స్ మాత్ర‌మే.. ఇక తూర్పుగోదావ‌రి జిల్లా, కృష్ణా జిల్లాల్లో క‌లిపి 16 థియేటర్స్. మెత్తం మీద అర‌వింద్ గారి థియేటర్స్- 19. దిల్ రాజుగారివి నైజాం, వైజాగ్ క‌లిపి 60 థియేటర్స్ మాత్ర‌మే వున్నాయి. ఇక యు వి క్రియెష‌న్స్ వారికి గుంటూరు, సీడెడ్ క‌లిపి 35 థియేటర్స్ వున్నాయి. ఇక ఎషియ‌న్ సునిల్ కి నైజామ్ లో 200 పై చిలుకు థియేటర్స్ మాత్ర‌మే వున్నాయి. 

 

1170 దియెట‌ర్స్ లో ఇవ‌న్ని క‌లిపి 30% అయితే మిగ‌తా థియేటర్స్ ఎవ‌రి చేతిలో వున్నాయి. ఎవ‌రు గుత్తాధిప‌త్యం చేస్తున్నారు. దాదాపు 400 మంది మిగిలిన థియేటర్స్ లీజులు తీసుకుని సినిమాలు ఆడిస్తున్నారు. నైజాంలో సిటి మిన‌హ‌యిస్తే చాలా చోట్ల జిల్లాల వారిగా మీడియేట‌ర్స్ చేతిలో థియేటర్లు వున్నాయి. ఆంధ్రా లో కూడా ఇదే తీరు ఉంది. వీరంతా సినిమాని బ‌ట్టి, వాటి బ‌డ్జెట్ ల‌ని బ‌ట్టి థియేటర్స్ ఇస్తారు. (ఎందుకంటే సినిమా వ్యాపారం) థియేటర్స్ ఏ ప్ర‌భుత్వం చేతిలో వుండ‌వు. సినిమా అంటే వ్యాపారం. చాలా సార్లు పెద్ద చిత్రాల‌కి సైతం థియేటర్స్ దొర‌క‌ని ప‌రిస్థితి వుంది. 

 

ఈ సంక్రాంతి పండ‌గ‌కి  మూడు స్ట్రైట్ తెలుగు చిత్రాలు విడుద‌ల కానున్నాయి. దాంట్టో ఎన్టీఆర్ బ‌యోపిక్ గౌర‌వంగా అంద‌రూ అన్ని థియేటర్స్ రెండు రోజులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ త‌రువాత వ‌చ్చే విన‌య విధేయ రామ‌, ఎఫ్‌2 చిత్రాలు షెర్ చేసుకునే ఒప్పందంలో ఈ సంక్రాంతి కి మూడు చిత్రాలు థియేటర్స్ స‌ర్దుబాటు చేసుకున్నారు. ఈలోపు స‌డ‌న్ గా వ‌చ్చిన పేట అనే డ‌బ్బింగ్ చిత్రానికి ప్రాధాన్యం ఎలా ఇస్తారు. 

 

ఒక వేళ దానికి ప్రాధాన్య‌త ఇస్తే అదుగో మ‌న తెలుగు సినిమాకి థియేటర్స్ ఇవ్వ‌కుండా డ‌బ్బింగ్ చిత్రానికి ప్రాధాన్య‌త ఇచ్చార‌ని అరోప‌ణ‌లు చేస్తారు. కోట్ల  రూపాయిలు వ్యాపారంలో ఎవ‌రు ముందు వ‌స్తే వారికే ఇస్తారు కాని ఇదే మ‌న్నా రిజ‌ర్వేష‌న్స్ వున్నాయా.... అస‌లు పేట చిత్ర ప్రీరిలీజ్ కి హీరో ర‌జ‌నీకాంత్ గారు రాలేదంటే ఇంక ఆ చిత్రానికి ప్రేక్ష‌కులు ఎందుకు వ‌స్తార‌నే సందేహం ఎగ్జ‌బిట‌ర్స్ కి వుండ‌దా.. ఇవ‌న్ని ప‌క్క‌న పెట్టి మైక్ వుంది క‌దా అని ఇలా ఆరోపించ‌టం స‌బ‌బు కాదు..

 

ఇదీ వాస్తవం. సినిమా అంటే వ్యాపారం. ఆ వ్యాపారానికి సంబంధించి చాలా లెక్కలుంటాయి. కోట్లతో చేసే అతి పెద్ద రిస్క్‌ సినిమా. డబ్బింగ్‌ రైట్స్‌ కొనేసి, సినీ పరిశ్రమలో వివాదాలు సృష్టించాలనుకోవడం తగదు. ముందస్తు సమాచారం టాలీవుడ్‌ దృష్టికి తీసుకు వచ్చి వుంటే, 'పేట' సినిమాకి ఈ సమస్య వచ్చేది కాదేమో. అయినా, తెలుగువారికి పెద్ద పండుగ అయిన సంక్రాంతికి, పెద్ద సినిమాల నడుమ, డబ్బింగ్‌ సినిమాని తీసుకురావాలనుకోవడం సమర్థనీయం కాదు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS