ఓ పక్క 'వినయ విధేయ రామ' సందడి షురూ అయ్యింది. లేటెస్టుగా విడుదలైన చరణ్ స్టిల్ గురించి, మహేష్ అభిమానుల పేరుతో, ఎన్టీఆర్ అభిమానుల పేరుతో సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. అయితే హీరోల మధ్య అలాంటి గొడవలేం లేవు. మహేష్ ఫ్యామిలీ, చరణ్ ఫ్యామిలీ కలిసి క్రిస్మస్ పార్టీని సందడిగా చేసుకున్నారు. తాజాగా ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా చరణ్ ఫ్యామిలీతో పార్టీ చేసుకున్న ఫోటోలు బయటికి వచ్చాయి.
చరణ్ భార్య ఉపాసనతో ఎన్టీఆర్ భార్య ప్రణతి ఇంకా పలువురు లేడీస్‌తో కలిసి చరణ్ దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇవన్నీ ఇలా ఉంటే, ఫ్యాన్స్ మధ్య గొడవలు మాత్రం అలానే ఉన్నాయి. నాగబాబు, బాలయ్య ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తూనే ఉంది. లేటెస్టుగా చరణ్ స్టిల్ గురించి కూడా పెద్ద రచ్చే జరుగుతోంది. ఇలా ఎప్పటికప్పుడే ఫ్యాన్స్ ఫైర్ అవుతూనే ఉన్నారు. ఎప్పటికప్పుడే హీరోలు తమ ఐకమత్యాన్ని చాటుకుంటూనే ఉన్నారు.
భరత్ అనే నేను' ఆడియో ఫంక్షన్‌లో ఎన్టీఆర్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, మహేష్ అన్నదమ్ముల్లా కనిపించారు ఆ వేడుక మీద. ఆ తర్వాత కూడా ఫ్యాన్స్ కొట్టుకున్నారు సోషల్ మీడియాలో. ఫ్యాన్స్‌కి తెలియని విషయం ఏంటంటే, హీరోల మధ్య ఎప్పుడూ ఎలాంటి పొరపొచ్చాలూ ఉండవు. ఫ్యాన్స్‌కే అన్నీ. బహిరంగ వేదికలపై కూడా హీరోలు చాలాసార్లు ఈ విషయాన్ని ప్రస్థావించారు. కానీ ఫ్యాన్స్‌లో ఎలాంటి మార్పులు రావట్లేదు. వీళ్లింతే వీళ్లని మార్చలేం.