'వినయ విధేయ రామ' ఆడియో రెస్పాన్స్‌ అయ్యో రామ.!

మరిన్ని వార్తలు

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన 'వినయ విధేయ రామ' పాటల వేడుక ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈ లోగా చిత్ర యూనిట్‌ విడుదల చేసిన ఆడియో జ్యూక్‌ బాక్స్‌కి మిశ్రమ స్పందన వస్తోంది. బాలేవంటూ కొందరు. అస్సలు బాలేవంటూ కొందరు, ఎక్స్‌పెక్ట్‌ చేసిన మ్యూజిక్‌ కాదిది అని ఇంకొందరు.. ఇలా నెగిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోందీ ఆడియోకి. డీవీవీ నిర్మాణ సంస్థ నుండే ఆడియో విషయంలో అసహనం వినిపిస్తోంది. 

 

'రంగస్థలం'తో అదిరిపోయే మ్యూజిక్‌ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌ నుండి వస్తోన్న ఆడియో అంటే ఫ్యాన్స్‌ చాలా ఎక్కువ అంచనాలు వేశారు. కానీ ఆడియో రివర్స్‌ గేర్‌ కొట్టేసింది. 'ఏక్‌ బార్‌..' అని సాగే ఐటెం సాంగ్‌ కూడా బాగా నిరాశపరిచింది. 'జిగేల్‌ రాణి..'తో 'రంగస్థలం'లో సూపర్బ్‌ ఐటెం సాంగ్‌ అందించిన దేవిశ్రీ ఆడియో ఎందుకిలా ఫెయిలైంది.. అంటూ అభిమానులు డిజప్పాయింట్‌ అవుతున్నారు. 

 

అయితే సినిమా విడుదలయ్యాక చరణ్‌ తన డాన్సింగ్‌ స్టైల్‌తో పాటలకు మ్యాజిక్‌ చేసేయగలడనిపిస్తోంది. కైరా అద్వానీ చరణ్‌కి మంచి డాన్సింగ్‌ పాట్నర్‌. ఒక్కసారి విజువల్‌గా పాటలు వింటే ఆ ఇంపాక్ట్‌ మరోలా ఉంటుంది అని కొందరు ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. చూడాలి మరి సినిమా విడుదలయ్యాక పాటలకు రెస్పాన్స్‌ పెరుగుతుందేమో. ఈ రోజు సాయంత్రం జరగనున్న 'వినయ విధేయ రామ' ఆడియో రిలీజ్‌ ఈవెంట్‌కి మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిధిగా విచ్చేస్తున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS