నేనే రాజు నేనే మంత్రి చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ తరుణంలో హీరో రానా చాలా సంతోషంగా ఉన్నాడు. అలాగే ఈ చిత్రాన్నివీలైనన్ని చోట్ల ప్రమోట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.
ఇలాంటి టైంలో రానాకి ఒక చేదు వార్త తెలిసింది. అదేంటంటే- రామానాయుడు గారి కుటుంబానికి చెందిన సురేష్ మహల్ అనే ధియేటర్ ఆంధ్రప్రదేశ్ లోని చీరాలలో ఉంది. అయితే ఆ ధియేటర్ లో మరమ్మతులు చేపట్టి ఇప్పుడు రెండు స్క్రీన్స్ గా మార్చారు.
ఇక ఈ ఆధునిక హంగులతో రూపొందించిన ఈ ధియేటర్ ని రేపు రానా చేతుల మీదుగా ప్రారంభించాలి అని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఈ రోజు AC పరికరాలు అమరుస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దీనితో ధియేటర్ మొత్తం దగ్దమైంది. లక్షల్లోనే నష్టం వాటిల్ల్లి ఉంటుంది అని అంచనా వేస్తున్నారు. ఇక రిలీజ్ కి ముందు రోజే ఇలా జరగడం ఒకరకంగా దగ్గుబాటి కుటుంబానికి చేదువార్తే అని అభిప్రాయపడుతున్నారు.