బాలీవుడ్ నటుడు సీతారం పంచల్ కన్నుమూశారు.
గత కొన్ని నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న సీతారం పంచల్ ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే ఆనారోగ్యం కారణంగా సినిమాలు చేయకపోవడంతో ఆయన ఆర్ధికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
ఈయన పరిస్థితి తెలుసుకున్న కొంతమంది సినీ తారలు ఆర్దిక సహాయం చేయడం జరిగింది. అయితే సరైన చికిత్స లేకపోవడంతో ఆయన మృతిచెందినట్టు తెలుస్తున్నది.
ఆయనకి బాగా గుర్తింపు తెచ్చిన సినిమాలు- పాన్ సింగ్ తోమర్, పీప్లీ లైవ్ అలాగే ఆయన నటించిన ఆఖరి చిత్రం- జాలీ ఎల్ ఎల్ బీ 2.
ఈ సందర్భంగా iqlikmovies.com తరపున ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాము.