వెంకీ - క్రిష్‌... అంతా హుష్‌...

మరిన్ని వార్తలు

'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' త‌ర‌వాత క్రిష్‌నుంచి వ‌చ్చే సినిమా ఏది??  ఈ విష‌యంపై చాలా చ‌ర్చే న‌డిచింది. అయితే చివ‌రికి వెంక‌టేష్‌తో అని ఫిక్స‌యిపోయారంతా. వెంకీ 75వ చిత్రం క్రిష్ చేతికి వెళ్లింద‌ని, అందుకోసం క్రిష్ ఓ వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ని ఎంచుకొన్నాడ‌ని, ఈ థ్రిల్ల‌ర్ క‌థ‌లో గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యం ఉంద‌ని చెప్పుకొన్నారు. ఈ ప్రాజెక్ట్ విష‌య‌మై వెంకీ - క్రిష్‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగాయి. అయితే ఎందుక‌నో.. స‌డ‌న్‌గా వెంకీ ఈ సినిమా నుంచి డ్రాప్ అయిపోయిన‌ట్టు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో పూరి జ‌గ‌న్నాథ్ సినిమాని ప‌ట్టాలెక్కించ‌డానికి వెంకీ నిర్ణ‌యం తీసుకొన్నాడ‌ని, ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్ర‌క‌ట‌న అతి త్వ‌ర‌లో వెలువ‌డే ఛాన్సుంద‌ని తెలుస్తోంది. వెంక‌టేష్ న‌టించిన గురు షూటింగ్ పూర్త‌య్యింది. వేస‌వికి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ఈలోగానే వెంకీ - పూరిల సినిమా ప‌ట్టాలెక్కేసే ఛాన్సుంది. అయితే వెంకీ - క్రిష్‌ల ప్రాజెక్టు ఆగిపోలేద‌ని, పూరి సినిమా పూర్త‌య్య‌క క‌చ్చితంగా మొద‌ల‌వుతుంద‌ని క్రిష్ స‌న్నిహితులు చెబుతున్నారు. మ‌రి ఈలోగా క్రిష్ ఏ హీరోని సెట్ చేసుకొంటాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS