మళ్లీ సినిమాల్లోకి రానున్న మాజీ హీరోయిన్‌.!

మరిన్ని వార్తలు

యాక్టింగ్‌ బగ్‌ - ఒక్కసారి పుట్టిందంటే అంతే సంగతి. ఆ స్వీట్‌ పెయిన్‌ వదులుకోవడానికి ఎవరూ ఇష్టపడరు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో సినిమాల్ని వదిలేసిన నిన్నటి తరం హీరోయిన్‌ నగ్మా తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటోంది. ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉంది. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. 

 

మీరట్‌ నుండి పోటీ చేయాలని ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ సూచిస్తోంది. నగ్మా మాత్రం ముంబయ్‌ నుండి పోటీ చేయాలనుకుంటోంది. గతంలో తమిళనాడులో కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతల్ని భుజానికెత్తుకుంది నగ్మా. ప్రస్తుతం కాశ్మీర్‌, మరో రాష్ట్రానికి సంబంధించి బాధ్యతల్ని నిర్వహిస్తోంది. నగ్మా కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న అతి కొద్ది స్టార్‌ క్యాంపెయినర్స్‌లో ఒకరు. 

 

ఇటీవల తెలంగాణా ఎన్నికల ప్రచారానికి కూడా వచ్చింది నగ్మా. అప్పుడే తనపై జనం కురిపించిన అభిమానానికి ముగ్ధురాలైన నగ్మా తిరిగి తెలుగు సినిమాల్లో నటించాలని నిర్ణయించుకుందట. ఎన్నికల తర్వాత ఆమె సినిమాల్లో నటించడంపై కీలక నిర్ణయం తీసుకోబోతుందని సమాచారమ్‌. ఒకప్పుడు హీరోయిన్‌గా గ్లామర్‌తో ఆకట్టుకున్న నగ్మా, జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'అల్లరి రాముడు' సినిమాలో అత్త పాత్రలో కనిపించి అదే స్థాయిలో ఆకట్టుకుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS