త్వరలోనే డైరెక్షన్‌ చేస్తా - రేణూదేశాయ్‌

మరిన్ని వార్తలు

'బద్రి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై తర్వాత సినిమా కూడా పవన్‌ కళ్యాణ్‌తోనే నటించి, చివరికి పవన్‌నే పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ రేణూ దేశాయ్‌. అయితే ఇప్పుడు పవన్‌కి మాజీ భార్యలెండి అది వేరే విషయం. ఇక కెరీర్‌ పరంగా 'బద్రి', జానీ' రెండు సినిమాలు తప్ప మరో సినిమాలో నటించలేదు రేణూదేశాయ్‌. ఇప్పుడిప్పుడే నటనలో మళ్లీ యాక్టివ్‌ అవ్వాలనుకుంటోంది. ఆ దిశగా రెండు ప్రాజెక్టులు ఆల్రెడీ ఓకే చేసింది కూడా. 

 

ఇదిలా ఉంటే రేణూ దేశాయ్‌ మల్టీ టాలెంట్‌ అన్న సంగతి తెలిసిందే. టెక్నికల్‌ విభాగంలో ఆమెకు అనుభవం ఉంది, ఆశక్తి ఉంది. ఆ ఆశక్తితోనే ఆల్రెడీ మరాఠీలో దర్శకురాలిగా సినిమా తెరకెక్కించింది. ఇక తెలుగులోనూ త్వరలో మెగాఫోన్‌ పట్టేందుకు సిద్ధంగా ఉంది. అందుకు కథ కూడా ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టిందట రేణూదేశాయ్‌. ఆ కథ రైతు జీవితాలను బేస్‌ చేసుకుని ఉంటుందని గతంలోనే తెలిసింది. అయితే రైతు నేపథ్యాన్ని రేణూ దేశాయ్‌ ఎంచుకోవడానికి అసలు కారణమేంటంటే ఆమెకు చిన్నతనం నుండీ వ్యవసాయం చేయడమంటే ఇష్టమట. 

 

చిన్నతనం నుండీ వ్యవసాయం చూస్తూ, చేస్తూ పెరిగిందట. అలా ఆ వ్యవసాయంలో ఉండే కష్టనష్టాలూ, రైతు సమస్యలపై కూలంకషమైన అభిప్రాయముందట రేణూదేశాయ్‌కి. అందుకే ఆ సమస్యల్నే దర్శకురాలిగా తన తొలి తెలుగు చిత్రానికి కథగా ఎంచుకోవాలని డిసైడ్‌ అయ్యిందట. అయితే రైతు సమస్యలు కాకుండా, రైతుల పిల్లల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రేణూ దేశాయ్‌ సినిమా నడుస్తుందని చెబుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS