జనసేన గుర్తు 'గాజుగ్లాస్‌' మరి ఆలియా భట్‌ గుర్తు ఏంటో తెలుసా?

మరిన్ని వార్తలు

అదేంటీ బాలీవుడ్‌ బ్యూటీ ఆలియాభట్‌ ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిందనుకుంటున్నారా.? కాస్త ఆగండి. అసలు విషయమేంటంటే బాలీవుడ్‌లో ఆలియాభట్‌ తాజా చిత్రం 'కళంక్‌' విడుదలకు సిద్ధమైన సందర్భంగా, ఈ సినిమా ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొంటోంది ఆలియాభట్‌. లేటెస్ట్‌గా 'కళంక్‌' ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌తో కలిసి ఆలియాభట్‌, బాలీవుడ్‌ బుల్లితెర మెగా కామెడీ షో కపిల్‌శర్మ షోలో సందడి చేసింది. ఈ షోలో ఆలియాకి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది.

 

ఒకవేళ మీరు రాజకీయ పార్టీ పెడితే, మీ పార్టీ గుర్తు ఏదై ఉంటుంది..? అనే ప్రశ్నకు తడుముకోకుండా ఆలియాభట్‌ 'ప్లేట్‌' అని సమాధానమిచ్చింది. ఎందుకంటే ప్లేట్‌కి మన లైఫ్‌ స్టైల్‌లో చాలా ప్రాధాన్యత ఉందని సమాధానమిచ్చింది. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ జనసేన గుర్తు గాజుగ్లాస్‌ కావడంతో ఆ గ్లాసుకు ఎంతటి పాపులారిటీ వచ్చిందో తెలుసు కదా. కప్పులు పక్కన పెట్టేసి, చాలా చోట్ల గాజు గ్లాసుల్లోనే టీ, కాఫీలు తాగడం మొదలెట్టేశారు ఫ్యాన్స్‌. అలాగే ఆలియాభట్‌ ప్లేట్‌కీ అంత పాపులారిటీ దక్కడం ఖాయం (ఫన్నీగా). 

 

ఇకపోతే ఆలియాభట్‌ ప్రస్తుతం తెలుగులో 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆలియా చక్కగా తెలుగు భాషను కూడా నేర్చేసుకుంటోంది. ఓ పక్క 'కళంక్‌' ప్రమోషన్స్‌, మరోపక్క 'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం తెలుగు భాషతో కుస్తీ ఇలా ఫుల్‌ బిజీగా గడుపుతోంది. ఇటీవల చరణ్‌ కాలికి గాయం కారణంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్‌, ఎన్టీఆర్‌ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, అలియాభట్‌ హీరోయిన్‌గా రామ్ చరణ్తో జోడీ కడుతోంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS