సినీ పరిశ్రమలో నటీనటుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చేతి నిండా అవకాశాలు ఉండి.. మంచి స్థితిలో ఉంటేనే అందరూ పట్టించుకుంటారు. ఒక్కసారి కెరీర్ డల్ అయ్యిందా..! ఇక అంతే సంగతి. అంతకన్నా దారుణమైన పరిస్థితి ఇంకెవరికీ ఉండదు. ఒకప్పుడు మనతోనే ఉన్న జనాలు కూడా మన దరిదాపుల్లో కనిపించరు. ఇప్పుడు ఇలాంటి స్థితినే ఒక నటి ఎదుర్కొంటుంది. అనారోగ్యం పాలై హాస్పిటల్ లో బిల్ కూడా కట్టలేని స్థితిలో ఇబ్బంది పడుతుంది.
ప్రముఖ నటులు అర్జున్, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ 'హనుమాన్ జుంక్షన్'లో హీరోలకు గారాల చెల్లెలిగా, మరో హీరో వేణుకి జోడిగా నటించిన విజయలక్ష్మి జీవితం ఇప్పుడు అధమ స్థితిలో ఉంది. కొన్నిరోజుల క్రితం.. హైబీపీ కారణంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అయితే.. ఆరోగ్య స్థితి కొంచెం సీరియస్ గా ఉండటం వల్ల ఐసీయూ లో ఉంచి వైద్యం చేసారు.
కాగా.. బిల్ కట్టటానికి కూడా డబ్బులు లేవని.. విజయలక్ష్మి చెల్లి ఎవరైనా దాతలుంటే సహాయం అందించగలరని కోరింది. ఆమె అభ్యర్థనను గమనించి కన్నడ సినీ ఆర్టిస్టుల సంఘం వారు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. ప్రస్తుతానికి.. విజయలక్ష్మి పరిస్థితి పర్వాలేదు కానీ, ఇంకా కొన్ని రోజులు ఐసీయూ లోనే ఉంచాలని డాక్టర్లు సూచించారట.