చంద్రబాబు గురించి రానా ఏమన్నాడంటే.!

మరిన్ని వార్తలు

ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌లో రానా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదల దగ్గరపడుతున్న తరుణంలో సినిమా ప్రమోషన్స్‌ వేగవంతం చేశారు. అందులో భాగంగా ఈ సినిమాలోని నటీనటులతో పలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. తన పాత్ర గురించి రానా వివరిస్తూ, 'అందరి పాత్రల కన్నా, నా పాత్రే కష్టమైనది. చంద్రబాబు నాయుడు పాత్ర పోషించడమంటే అంత ఆషామాషీ కాదు. ఆయనదో చరిత్ర. నా 20 ఏళ్ల కెరీర్‌లో చంద్రబాబు ప్రభావం పరోక్షంగా నాపై ఉంది..' అన్నారు. ఈ పాత్ర పోషించడానికి ముందే రానా చంద్రబాబును కలిశారు. ఆయనతో కాసేపు ముచ్చటించిన సంగతి తెలిసిందే. 

 

ఇక గెటప్‌ పరంగా రానా, నారా చంద్రబాబు నాయుడి పాత్రలో ఎలా ఒదిగిపోయారో ఆల్రెడీ పోస్టర్స్‌లో చూసేశాం. 'బాహుబలి'లో 'భళ్లాలదేవ'గా విశ్వరూపం చూపించిన రానా ఇప్పుడు చంద్రబాబుగా ఎన్టీఆర్‌ బయోపిక్‌తో ఎలా మెప్పిస్తాడో చూడాలిక. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి బాలయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ సతీమణిగా విద్యాబాలన్‌ నటిస్తుండగా, ఇతర కీలక పాత్రలను టాలీవుడ్‌ నుండి ప్రముఖ నటీ నటులు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల కానుంది. మొదటి భాగం ఎన్టీఆర్‌ 'కథానాయకుడు' జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండో భాగం 'మహానాయకుడు' ఫిబ్రవరి 7న విడుదల కానుంది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS