ఎట్టకేలకి గజల్ శ్రీనివాస్ కి బెయిల్

మరిన్ని వార్తలు

సమాజంలో ప్రముఖుడిగా మంచి పేరు ఉన్న గజల్ శ్రీనివాస్ ఈ నెల 2వ తేదీన ఒక స్త్రీ ని లైంగికంగా వేదిస్తున్నాడు అన్న ఆరోపణల పైన అరెస్ట్ అవ్వడం తెలిసిందే. 

ఆ కేసులో ఆయన ఈ నేరానికి పాల్పడుతునట్టుగా ఆధారాలు కూడా లభించడంతో పోలీసులు ఆ సాక్ష్యాలని కోర్టుకి సమర్పించడంతో ఈయనకి వెంటనే రిమాండ్ విదించింది. దీనితో ఈయని వెంటనే జైలుకి తరలించారు పోలీసులు. 

ఇక ఆ తరువాత ఆయన పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. ఇదిలావుండగా ఈరోజు మరోమారు బెయిల్ కోరుతూ పిటీషన్ వేయగా, కోర్టు ఆయనకీ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. 

దీనితో గత 22 రోజులుగా జైలులో గడుపుతున్న గజల్ శ్రీనివాస్ కి ఎట్టకేలకి బెయిల్ దొరికింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS