ఛాలెంజింగ్‌ రోల్‌లో సమంత

మరిన్ని వార్తలు

'రాజుగారి గది 2'లో ముద్దుగుమ్మ సమంత దయ్యంలా కనిపించింది. ఇప్పుడు దెయ్యం మిస్టరీని చేధించే డైనమిక్‌ యువతి పాత్రలో సమంత కనిపించబోతోంది. కన్నడలో సూపర్‌ హిట్‌ అయిన 'యూ టర్న్‌' సినిమాని తాజాగా రీమేక్‌ చేస్తున్నారు. 

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కన్నడ దర్శకుడు పవన్‌ కుమార్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇదొక రోడ్‌ మిస్టరీగా తెరకెక్కుతోన్న సినిమా. ఒక యూటర్న్‌ కొందరి జీవితాలతో ఎలా ఆటలాడుకుంది అనేది కీలకమైన పాయింట్‌ ఈ సినిమాలో. క్రైమ్‌ థ్రిల్లర్‌ ప్లస్‌ ఆత్మలకు సంబంధించిన స్టోరీ ఇది. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్‌ స్టోరీ. స్టార్టింగ్‌ నుండి, ఎండింగ్‌ వరకూ మంచి థ్రిల్‌ కలిగిస్తుంది. సమంతది ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర. 

ఎన్నో గ్లామరస్‌ పాత్రల్లో నటించిన సమంతకు నటిగా ఓ ఛాలెంజింగ్‌ రోల్‌ కానుంది ఇది. కన్నడలో శ్రద్ధా శ్రీనాధ్‌ ఈ పాత్ర పోషించింది. 'రాజుగారి గది 2'లో నాగార్జున, డెయ్యం పాత్ర అయిన సమంతకు సాయం చేస్తాడు. ఈ సినిమాలో దెయ్యం పాత్రకు సమంత సాయం చేస్తుంది. అదీ సినిమా స్టోరీ. ఫిబ్రవరిలో సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. ఈ తరహా పాత్రలో నటించడం తనకెంతో సంతోషంగా ఉందంటోంది ముద్దుగుమ్మ సమంత. మరో పక్క సమంత ప్రస్తుతం 'రంగస్థలం' సినిమాలో నటిస్తోంది. 

ఈ సినిమాలో సమంత పోషించే పాత్ర కూడా విలక్షణంగానే ఉండబోతోంది. మామూలు గ్లామర్‌ పాత్రలకు భిన్నమైన పాత్ర ఇది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్ర. చాలా కొత్తగా కనిపిస్తుంది సమంత ఈ పాత్రలో. చరణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS