ప్రభుదేవా బర్త్‌డే గిఫ్ట్‌ అదిరిందయ్యా గణేశా.!

మరిన్ని వార్తలు

ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా స్వీయ కంపోజేషన్‌లో వచ్చిన 'ఊర్వశీ.. ఊర్వశీ..' సాంగ్‌ అప్పట్లో ఓ సంచలనం. యూత్‌ని ఉర్రూతలూగించేసిందీ పాట. అప్పటికీ, ఇప్పటికీ ఈ పాటలోని ఫ్రెష్‌నెస్‌ అలాగే ఉంటుంది. తాజాగా ఈ పాటను రీ క్రియేట్‌ చేశారు గణేష్‌ మాస్టర్‌ అండ్‌ టీమ్‌. ఈ రోజు ప్రభుదేవా పుట్టినరోజు సందర్భంగా ఈ పాటతో ఆయనకు స్పెషల్‌ బర్త్‌డే విషెస్‌ అందించారు. ప్రభుదేవా మ్యాజిక్‌ని రిపీట్‌ చేయడమంటే అంత ఈజీ కాదు. 

 

 

కానీ గణేష్‌ మాస్టర్‌ అండ్‌ టీమ్‌ ఈ పాటను రీ క్రియేట్‌ చేయడానికి చాలా కష్టపడింది. మేగ్జిమమ్‌ ట్రై చేసింది. ఆదిత్య మ్యూజిక్‌ వారు ఈ పాటను విడుదల చేశారు. యూ ట్యూబ్‌లో ఈ పాట సంచలనంగా మారింది. సోషల్‌ మీడియాలో డాన్స్‌ దేవుడు ప్రభుదేవాకి బర్త్‌డే విషెస్‌ పోటెత్తుతున్నాయి. డాన్స్‌ కొరియోగ్రాఫర్‌గానే కాకుండా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగానూ ప్రభుదేవా సత్తా చాటుతున్నారు. త్వరలో ప్రభుదేవా 'అభినేత్రి 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తమన్నా, ప్రభుదేవా జంటగా తెరకెక్కుతోన్న ఈ సినిమా 'అభినేత్రి'కి సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే. 

 

ఇదిలా ఉంటే, తెలుగులో హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా..' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమయ్యారు ప్రభుదేవా. తర్వాత 'పౌర్ణమి', 'శంకర్‌దాదా జిందాబాద్‌' తదితర చిత్రాలకు డైరెక్షన్‌ చేసిన ప్రభుదేవా తర్వాత బాలీవుడ్‌లో వరుస చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌తో 'దబాంగ్‌ 3' సినిమా చేస్తున్నారు. డాన్స్‌ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇన్ని రంగాల్లో సినీ పరిశ్రమకు అద్భుతమైన సేవలందిస్తోన్న ప్రభుదేవా ఇలాంటి మరెన్నో బర్త్‌డేలు జరుపుకోవాలని ఆశిస్తూ, మనం కూడా ఆయనకు బర్త్‌డే విషెస్‌ చెప్పేద్దామా.. 'విష్‌ యు మెనీ మోర్‌ హ్యాపీ రిటర్న్స్‌ ఆఫ్‌ ది డే టు ప్రభుదేవా మాస్టర్‌'.! 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS