టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న తరుణంలోనే బాలీవుడ్‌లో 'అయ్యారీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఆ సినిమాతో అక్కడ రకుల్‌కి కొత్తగా ఒరిగిందేమీ లేదు కానీ, టాలీవుడ్‌కి మాత్రం శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి తీసుకొచ్చేసింది. ఆ తర్వాత రకుల్ టాలీవుడ్ వైపు ఎంతగా కొంటె చూపులు చూసినా, ఆమె చూపుల్ని అస్సలు పట్టించుకోలేదు. ఎట్టకేలకు నాగార్జున 'మన్మధుడు 2' సినిమాలో పిలిచి ఆఫర్ ఇవ్వడంతో హీరోయిన్‌గా రీ ఎంట్రీ షురూ అయ్యింది.
ఈ సంగతి కాస్సేపు పక్కన పెడితే, సోషల్ మీడియాలో అస్తమానూ ట్రాలింగ్‌కి గురయ్యే రకుల్ ప్రీత్‌సింగ్‌ని నెటిజన్లు తాజాగా మళ్లీ ఓ ఆట ఆడేసుకుంటున్నారు. అందుకు కారణం బాలీవుడ్‌లో రకుల్ చేస్తున్న 'దే దే ప్యార్ దే' మూవీ ట్రైలర్‌నే. లేటెస్ట్‌గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌లో రకుల్ బా..గా.. ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అంటే అలాంటిలాంటి ఓపెన్ కాదు, హాట్‌నెస్‌లో హార్ట్‌ఫుల్లుగా ఓపెన్ అయిపోయింది. వయసులో చాలా చాలా డిఫరెన్స్ ఉన్న అజయ్‌దేవగణ్‌తో రెచ్చిపోయి మరీ రొమాన్స్ చేసిన దృశ్యాలు యూత్‌ని కట్టి పడేస్తున్నాయి.
రకుల్ అందాల్ని ఓ పక్క ఎంజాయ్ చేస్తూనే ఎందుకో మరోపక్క నెటిజన్లు రకుల్‌ని ఆటాడేసుకుంటున్నారు. అయినా ఈ మధ్య రకుల్‌రకుల్ ప్రీత్ సింగ్ బిహేవియర్ అందరికీ అవకాశమైపోయింది. దాంతో ఆమె ఏ చిన్న తప్పు చేసినా, అది తప్పైనా, ఒప్పైనా కూడా విడిచి పెట్టడం లేదు. అలాగే 'దే దే ప్యార్‌దే' మూవీ ట్రైలర్ విషయంలోనూ జరిగింది. మే 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ శృతి మించిన హాట్‌నెస్‌తో రకుల్ ఈ సారైనా బాలీవుడ్‌ని ఆకట్టుకుంటుందో లేదో చూడాలిక.