'బొమ్మరిల్లు' పాప 'లవ్‌'కి 41 ఏళ్లు!

మరిన్ని వార్తలు

'హా హా హాసిని..' అంటూ 'బొమ్మరిల్లు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేయించుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. తన బబ్లీ బాడీ లాంగ్వేజ్‌తో కుర్రోళ్ల మనసుల్ని కొల్లగొట్టింది. ఆ పై బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌లో బిజీగా ఉన్న టైంలోనే హీరో రితీష్‌ దేశ్‌ముఖ్‌తో లవ్‌లో పడింది. పెళ్లికి పెద్దల అంగీకారం లభించక నానా సినిమా కష్టాలు పడిన ఈ జంట లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఎట్టకేలకు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు రితేష్‌ - జెనీలియా జంటకు రియాన్‌, రేహిల్‌ అను ఇద్దరు కుమారులున్నారు.

 

లేటెస్ట్‌గా రితీష్‌ దేశ్‌ముఖ్‌ 41వ బర్త్‌డే సందర్భంగా జెనీలియా తన లవ్‌కు స్పెషల్‌గా బర్త్‌డే విషెస్‌ చెబుతూ ఓ స్వీట్‌ అండ్‌ క్యూట్‌ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. తన ఇద్దరు కుమారులతో కలిసి జెనీలియా తన భర్తను ముద్దాడుతున్న ఈ పిక్‌కి నెటిజన్స్‌ నుండి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. హీరోయిన్‌గా స్టార్‌ హీరోలందరి సరసనా నటించి మెప్పించిన జెనీలియా ప్రస్తుతం భార్యగా, తల్లిగా ఇంటి పట్టునే ఉండి బాధ్యతలు చూసుకుంటోంది. ఈ మధ్య జెనీలియా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోందట.. అనే గుసగుసలు వినిపించాయి. కానీ, ఆ గుసగుసలకు సరైన మసాలా దట్టలేదు. దాంతో ఆ వార్తలకు పట్టు చిక్కలేదు. ఏమో ప్రస్తుతానికి జెనీలియాకి ఆ ఆలోచన ఉన్నట్లు లేదు. పెళ్లి తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లు కెరీర్‌లో బిజీ అవుతున్న సందర్భాలు అనేకం చూస్తున్నాం. అలా భవిష్యత్తులో జెనీలియా కూడా అలాంటి ఆలోచనలు చేస్తుందేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS