'అల వైకుంఠపురములో..' టబు ఏం చేస్తోందంటే!

By Inkmantra - December 17, 2019 - 16:00 PM IST

మరిన్ని వార్తలు

అప్పుడెప్పుడో బాలయ్య నటించిన 'పాండురంగడు' సినిమాలో టబు కనిపించింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే తెలుగులో సందడి చేయబోతోంది. అల్లు అర్జున్‌ నటించిన 'అల వైకుంఠపురములో..' సినిమా ద్వారా అందాల భామ టబు రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో టబు పాత్ర ఎలా ఉండబోతోందనే అంశంపై క్లారిటీ లేదు. కానీ, ఆమెని చాలా అందంగా చూపిస్తున్నారు. అల్లు అర్జున్‌ అక్క పాత్రని ప్రచారం జరుగుతోంది. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో టబు పాత్ర చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందట.

 

ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకుంటోందట టబు. చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలో నటించడం.. అందులోనూ హీరోయిన్‌ రోల్‌ కాకుండా, హుందా అయిన పాత్రలో కనిపించడంతో తన పాత్రపై చాలా ఎగ్జయిట్‌మెంట్‌తో ఉందట. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా.? అని కామన్‌ ఆడియన్‌లా ఎదురు చూస్తున్నానని టబు చెబుతోంది. బాలీవుడ్‌లో రీసెంట్‌గా విడుదలైన 'దేదే ప్యార్‌ దే' సినిమాలో అజయ్‌ దేవగణ్‌ భార్యగా టబు నటించిన సంగతి తెలిసిందే.

 

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. మరోవైపు తెలుగులో మరిన్ని ప్రాజెక్టులు టబు కోసం క్యూ కట్టాయనీ తెలుస్తోంది. రానా హీరోగా తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' సినిమాలోనూ టబు ఓ ఇంపార్టెంట్‌ గెస్ట్‌ రోల్‌ పోషిస్తున్నట్లు సమాచారం ఉంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS