సోషల్ మీడియా అత్యంత జుగుప్సాకరంగా వ్యవహహరిస్తోంది. మంచి కన్నా చెడుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పుట్టింది అంటే పెరిగిందనడం మామూలే కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్‌తో ఏకంగా పర్సనల్ లైఫ్‌కే తంటాలు తెచ్చిపెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి. పుట్టినవాళ్లను పెంచేస్తున్నారు. బెడ్ మీద పడితే చాలు చంపేస్తున్నారు.
తాజాగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అనారోగ్య పరిస్థితి కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ వార్తకు సోషల్ మీడియా స్పందన ఏంటంటే, బ్రహ్మనందం ఆరోగ్యం అత్యంత విషమం అంటూ ప్రచారం చేశారు. అక్కడితో ఆగలేదు. బ్రహ్మనందం ఇక లేరు అనే పోస్ట్‌లు పెట్టేశారు. చాలా కాలం క్రితం ఎమ్మెస్ నారాయణ, మల్లికార్జునరావు, చంద్రమోహన్, ఏవీయస్ తదితరుల మీద కూడా ఇలాంటి పుకార్లే పుట్టించారు.
అయితే తాజా సమాచారం ఏంటంటే బ్రహ్మనందం కోలుకున్నారు. హార్ట్ సర్జరీ జరిగింది. ఐసీయూ నుండి జనరల్ వార్డ్‌కి తరలించారు. ఈ రోజుల్లో హార్ట్ సర్జరీ చాలా కామన్ ఇష్యూ. బ్రహ్మనందం కొడుకు గౌతమ్ ఆయన తండ్రి ఆరోగ్యం విషయంపై తాజాగా స్పందించారు. బ్రహ్మానందం త్వరగా కోలుకుని వెండితెరపై మళ్లీ నవ్వులు పూయించాలని కోరుకుందాం.