బీచ్‌లో హాట్‌ హాట్‌గా జంబలకిడి బ్యూటీ.!

మరిన్ని వార్తలు

సోషల్‌ మీడియాలో అందాల ఆరబోతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు ముద్దుగుమ్మలు. తద్వారా సినిమాల్లో ఛాన్సులు కొట్టేయడమన్నది వారి బ్యూటీ లక్ష్యం. అయితే అందాలారేసిన అందరికీ అవకాశాలు చిక్కేయవు కదా. అలాగే 'జంబలకిడి పంబ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సిద్దీ ఇద్నానీ కూడా ఇదే ప్రయత్నాల్లో బిజీగా ఉందిప్పుడు. తొలి సినిమాతో ఓకే అనిపించుకున్నా, అమ్మడికి మరో అవకాశం రాలేదింతవరకూ.

 

సినిమాలు లేకపోయినా, అవకాశం రావాలి అంటే ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా. అందుకే ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ఈ ప్రయత్నం ఎప్పటికి ఫలిస్తుందో కానీ, కొందరు ముద్దుగుమ్మలు పాపులర్‌ అయినాక సోషల్‌ మీడియాకి వస్తే, మరికొందరు తమ అందాలతో పాపులర్‌ అయ్యాక సినిమాల్లోకి వస్తున్నారు. ఈ సంగతి పక్కన పెట్టి, తాజా పిక్‌ విషయానికి వస్తే, బీచ్‌లో వైట్‌ అండ్‌ వైట్‌ టూ పీస్‌ బికినీలో సిద్దీ ఇద్నానీ వయ్యారాలు అదరహో అనిపించట్లా.!. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS