విశాల్-GSTల ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్

మరిన్ని వార్తలు

హీరో విశాల్ ఇల్లు, ఆఫీస్ పైన GST అధికారులు తనిఖీలు చేసారు అంటూ నిన్న రాత్రి దాదాపు అన్ని ఛానల్స్ లో వార్తలు ప్రసారం అయ్యాయి.

 

అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు అంటూ చెన్నై జోన్ GST అధికార్లు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. దీనితో నిన్న ప్రసారం అయిన వార్తల్లో ఎటువంటి నిజం లేదు అని తెలిసిపాయింది. ఇక ఈ అంశం పై హీరో విశాల్ ఇంకా స్పందించాల్సి వుంది.

ఇదిలావుండగా మెర్సల్ చిత్ర వివాదం కొనసాగుతూనే ఉండగా తాజాగా మెర్సల్ చిత్రం పైన ఒక వ్యక్తి కేసు వేయడం కూడా చర్చనీయాంశంగా మారింది.

మొత్తానికి మెర్సల్ చిత్రం వివాదాలకి కేంద్ర బిందువుగా మారింది అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS