ముద్దులే కాదు, ఇంకా చాలా ఉంది.

మరిన్ని వార్తలు

'గుణ 369' అంటూ వస్తున్నాడు యంగ్‌ హీరో కార్తికేయ. 'ఆర్‌ఎక్స్‌ 100', 'హిప్పీ' చిత్రాల్లో విచ్చలవిడిగా శృంగారం చేసిన ఈ యంగ్‌ హీరో, 'గుణ 369'తో సమ్‌థింగ్‌ స్పెషల్‌ అనిపించుకోనున్నాడట. కార్తికేయ అంటే 'ముద్దు'ల హీరో మాత్రమే అనే మార్క్‌ ఉంది ఇంతవరకూ. కానీ, ఈ సినిమాతో కేవలం ముద్దులే కాదు, కార్తికేయ అంటే 'ఇదీ' అని చూపించబోతున్నాడట. అర్జున్‌ జంధ్యాల ఈ సినిమాకి దర్శకుడు. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా డిజైన్‌ చేశారు. యాక్షన్‌ ఘట్టాల్ని, ఎమోషనల్‌ సీన్స్‌ని బాగా కనెక్ట్‌ అయ్యేలా చూపించబోతున్నారు ఈ సినిమాలో.

 

హీరోయిన్‌ అనఘ ప్రోమోస్‌లో చాలా అందంగా కనిపిస్తోంది. కార్తికేయ, అనఘ జంట ఆకట్టుకునేలా ఉంది. రేపు అనగా ఆగస్ట్‌ 2 ప్రేక్షకుల ముందుకు రానున్న 'గుణ 369' సినిమాపై కార్తికేయ చాలా నమ్మకాలు పెట్టుకున్నాడు. కెరీర్‌లో తొలి సినిమా హిట్టిచ్చి, రెండో సినిమాతో నిరాశ పరిచిన కార్తికేయ, ముచ్చటగా మూడో సినిమా అయిన 'గుణ 369'తో ఖచ్చితంగా హిట్‌ కొట్టాలనే కసి మీదున్నాడట. కూల్‌ రొమాంటిక్‌ స్టోరీతో పాటు, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని ఈ సినిమాలో బాగా టచ్‌ చేసినట్లు ప్రోమోస్‌ ద్వారా అర్ధమవుతోంది. చూడాలి మరి, 'గుణ 369'లో కార్తికేయ చూపించబోయే ఆ కొత్తదనమేంటో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS