ఈ మధ్య హన్సిక బికినీ ఫోటోలు లీకవ్వడం పెను వివాదానికి కారణం కావడం తెలిసిన సంగతే. అయితే తాజాగా మరోసారి హన్సిక ఈ లీకేజ్ ఫోటోలపై స్పందించింది. ఇవేమీ కొత్త ఫోటోలు కావట. నాలుగేళ్ల క్రితంనాటి ఫోటోలట. అవి ఇప్పుడెలా లీకయ్యాయో తనకే అర్ధం కావడం లేదంటోంది హన్సిక. అంతేకాదు, ఆ ఫోటోస్‌లో కొన్ని మార్ఫింగ్ ఫోటోలు కూడా ఉన్నాయట. అంటే ఆ ఫోటోలు తనవి కావని హన్సిక పరోక్షంగా చెప్పినట్లే.
అంతేకాదు, ఒకవేళ బికినీ షూట్‌కి వెళ్లాలంటే అదేం పెద్ద విషయం కాదనీ, గ్లామర్ రంగంలో ఉన్నప్పుడు ఇవన్నీ మామూలు విషయాలేననీ, గ్లామర్ కోసం తాను ఏమైనా చేస్తాననీ, గతంలో చేశాను కూడా అని హన్సిక చెప్పుకొచ్చింది. నిజంగా పబ్లిసిటీ స్టంట్ కోసం చేయాలంటే ఇలా లీకేజీ ఫోటోలు పట్టుకొని గగ్గోలు పెట్టాల్సిన అవసరం తనకు లేదని హన్సిక చెబుతోంది.
అయితే అదే సమయంలో తన ఫోన్, ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన మాట వాస్తవమేననీ, అసలింతకీ ఈ దుశ్చర్యకు పాల్పడిందెవరనే విషయంపై ఓ స్పెషల్ టెక్నికల్ టీమ్ వర్క చేస్తోందనీ హన్సిక ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుతం హన్సిక 'మహా' సినిమాలో నటిస్తోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఓ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.