నా మొబైల్‌ని ఎవరో హ్యాక్‌ చేశారు - హన్సిక

By iQlikMovies - January 24, 2019 - 10:30 AM IST

మరిన్ని వార్తలు

బొద్దుగుమ్మ హన్సిక పర్సనల్‌ ఫోటోస్‌ లీకేజీ విషయం సోషల్‌ మీడియాలో పెద్ద దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఈ విషయమై హన్సిక స్పందించింది. నా మొబైల్‌ ఫోన్‌ని, ట్విట్టర్‌ అకౌంట్‌ని ఎవరో హ్యాక్‌ చేశారు.. ఆ హ్యాకర్సే నా ఫోటోస్‌ని పోస్ట్‌ చేశారు. నా అనుమతి లేకుండానే ఆ లీక్స్‌ జరిగాయి. దీనిపై బ్యాక్ఎండ్‌ టీమ్‌ వర్క్‌ చేస్తోంది. నిజానిజాలేంటో త్వరలోనే బయటపడనున్నాయి. 

 

ఈలోగా నా అకౌంట్‌ నుండి వచ్చిన ఏ విషయాన్ని మీరు నమ్మొద్దు.. అని హన్సిక అభిమానులకు సూచించింది. అయితే ఈ ఫోటో లీక్స్‌ కారణంగా హన్సికకు చాలా బ్యాడ్‌ ఇమేజ్‌ వచ్చేసింది. దాన్ని కవర్‌ చేసుకునేందుకే ఈ హ్యాకర్స్‌ నాటకం ఆడుతోందని అంటున్నారు. ఏది ఏమైనా ఫామ్‌లో లేని ముద్దుగుమ్మలకైతే ఇలాంటి పబ్లిసిటీలు వర్కవుటౌతాయేమో కానీ, హన్సికకు మాత్రం అస్సలు వర్కవుట్‌ కాలేదు. 

 

అసలే ఈ మధ్య హన్సిక నానా రకాల వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆ క్రమంలో ఈ తాజా వివాదం ఆమె ఇమేజ్‌ని మరింత డ్యామేజ్‌ చేసిందనే చెప్పాలి. తాజాగా హన్సిక 'మహా' అనే థ్రిల్లర్‌ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా పోస్టర్సే చాలా వివాదాలు తెచ్చిపెట్టాయి. ఇక టీజర్‌, ట్రైలర్‌, సినిమా ఇంకెన్ని వివాదాలు తెచ్చిపెడుతుందో. ఈ వివాదాల నడుమ సినిమా ఎంతమేర సక్సెస్‌ అవుతుందో చూడాలి మరి. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS