యంగ్ & టాలెంటెడ్ తెలుగు దర్శకుల్లో ఒకరైన హను రాఘవపూడి దర్శకత్వం వహించిన లై చిత్రం రేపు విడుదల కానుంది. ఈ తరుణంలోనే ఆయన ఆనందం పదింతలు అయ్యేలా తండ్రి అయ్యాడు.
తెలుస్తున్న వివరాల ప్రకారం, హను భార్య అయిన అమూల్య నిన్న రాత్రి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. తల్లి బిడ్డా క్షేమం అని వైద్యులు తెలిపారు. మొన్న జరిగిన లై ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ తన దర్శకుడైన హను ఈ చిత్రం కోసం అతను పడిన తపన గురించి చెబుతూ- నిండు గర్బిని అయిన తన భార్యతో గడపకుండా, మాట్లాడకుండా ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ కోసం మాతోనే హను అమెరికాలోనే 75 రోజులు పాటు ఉన్నాడు.
తన చేసిన సినిమా రిలీజ్ కి ఒక్కరోజు ముందు తనకి బిడ్డ పుట్టడంతో హను ఇప్పుడు డబల్ హ్యాపి గా ఉన్నాడట. ఇక రేపు లై కూడా హిట్ అయితే హను ఆనందానికి అవదులు ఉండవు అనేది నిజం.