హను రాఘవపూడి... టాలీవుడ్ లో ప్రతిభావంతమైన దర్శకుల్లో తనొకడు. సీతారామంతో ఇప్పుడు మరో హిట్టు కొట్టాడు. తన వరుస పరాజయాలకు పుల్ స్టాప్ పెట్టాడు. అయితే... ఇది వరకే తనని `నారప్ప` డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. `అసురన్`ని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు దర్శకుడిగా హను పేరే ప్రతిపాదించారు. హనుతో చిత్రబృందం సంప్రదింపులు జరిపింది. కానీ హను `నో` చెప్పాడు. దాంతో ఆ ఛాన్స్.. శ్రీకాంత్ అడ్డాలకు వెళ్లిపోయింది. ఈ సినిమాని హను ఎందుకు రిజెక్ట్ చేశాడో ఈమధ్యే చెప్పుకొచ్చాడు
''వెట్రిమారన్ అంటే నాకు చాలా ఇష్టం. తన సినిమా రిలీజ్ అవుతోందంటే నేను చెన్నై వెళ్లి మరీ ఫస్ట్ డే, ఫస్ట్ షో చూస్తాను. తన సినిమాలు హార్డ్ హిట్టింగ్ గా ఉంటాయి. `అసురన్` కూడా అంతే. నాకిష్టమైన సినిమాల్లో అదొకటి. అలాంటి సినిమా జోలికి వెళ్లకపోవడమే మంచిదనిపించింది. అందుకే `నో` చెప్పా. కానీ ఎప్పటికైనా వెట్రిమారన్ సినిమానొకటి రీమేక్ చేయాలి. దాన్ని నా స్టైల్ లో అంతే హార్డ్ హిట్టింగ్ గా తీయాలి.. అందుకోసం ఎదురు చూస్తున్నా'' అని చెప్పుకొచ్చాడు హను రాఘవపూడి.