క్రికెట్-సినిమా ఈ రెండు ఇండియాలో బాగా పాపులర్. ఎంతంటే ఈ రెండిట్లో ఉన్నవాళ్ళు జీవితంలో ఒక్కటైతే అది పెద్ద వార్త అయ్యేంత. తాజా ఉదాహరణ- విరాట్ కోహ్లి & అనుష్క శర్మల వివాహం. ఈ వివాహానికి తరువాత జరిగిన రిసెప్షన్ కి ఎంతటి ఆదరణ లభించిందో మాటల్లో చెప్పలేం.
అయితే అది ముగిసిందో లేదో ఇప్పుడు మరో క్రికెట్-సినిమా జంట ఇప్పుడు వార్తల్లో నిలిచింది. వాళ్ళు ఎవరంటే- క్రికెటర్ హార్దిక్ పాండ్య & నటి ఎల్లి అవ్రామ్. గతంలో హార్దిక పాండ్య బాలీవుడ్ నటి పరిణీతి చోప్రాతో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే వెంటనే ఆ వార్తలని ఇటు హార్దిక్ అటు పరిణీతి ఖండించడంతో ఆ అంశం అక్కడికి ముగిసింది.
తాజాగా మరో వార్త హార్దిక్ చుట్టూ తిరుగుతుంది అదే హీరోయిన్ ఎల్లి అవ్రామ్ తో డేటింగ్ లో ఉన్నాడట. దీనికి సంబంధించి సాక్ష్యాలుగా హార్దిక్ అన్న కృనాల్ పాండ్య వివాహ రిసెప్షన్ లో ఎల్లి అవ్రామ్ హార్దిక్ కుటుంబంతో సన్నిహితంగా ఉండడం అలాగే హార్దిక్ తో కలిసి క్లోజ్ గా ఫొటోలకి ఫోజులు ఇవ్వడంతో ఈ వార్తకి బలం చేకూరినట్టయింది.
మరి ఈ బంధాన్ని ఈ ఇద్దరు ఇంకా దృవీకరించలేదు.