'హలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ కళ్యాణీ ప్రియదర్శిన్. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఈ బ్యూటీ తొలి సినిమాకే పర్‌ఫామెన్స్‌లో వందకు వంద మార్కులూ వేయించేసుకుంది. సినిమా హిట్ అయ్యుంటే మరోలా ఉండేదిలెండి. అయితేనేం రావల్సినంత ఫేమ్ రానే వచ్చిందిలెండి. అవకాశాలు కూడా బాగానే దక్కుతున్నాయి అమ్మడిని. అయితే గ్లామర్ విషయంలో కొన్ని లిమిట్స్ ఉన్నాయంటోంది ఈ ముద్దుగుమ్మ.
త్వరలో సాయిధరమ్‌తేజ్‌తో 'చిత్రలహరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతకన్నా ముందు సోషల్ మీడియాలో ఇలా దర్శనమిచ్చింది. పెద్దగా గ్లామర్ ఎక్స్‌పెక్ట్ చేయలేం కానీ, గ్లామర్ అంటే కురచ దుస్తుల్లోనే ఉండదు, సింగిల్ ఎక్స్‌ప్రెషన్ చాలు హాట్ అప్పీల్ రప్పించేందుకు అంటోందీ హాలో బ్యూటీ. సింపుల్ సూట్‌లో ఎక్స్‌ప్రెసివ్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటోన్న కళ్యాణీ పిక్స్ కుర్రోళ్లకు సరికొత్త కిక్ ఇస్తున్నాయి.