తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్గా వరుస సినిమాలతో బిజీగా గడిపిన శృతిహాసన్ గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. పవన్ కళ్యాణ్ తో 'గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన శృతిహాసన్.. చివరగా అదే హీరోతో 'కాటమ రాయుడు' సినిమాలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో అప్పటినుండి శృతిహాసన్ కొత్తగా సినిమాలు ఏమీ అంగీకరించలేదు.
సినిమాల్లోకి రాకముందే గాయకురాలిగా పేరు తెచ్చుకున్న శృతి.. పూర్తిగా నటన మానేసి సంగీతం వైపు అడుగేస్తుంది. దాదాపు రెండేళ్లుగా సినిమాలు ఒప్పుకోవడమే మానేసిన ఈ ముద్దుగుమ్మ తన మ్యూజిక్ టీంతో కలిసి స్టేజ్ షోలు నిర్వహిస్తోంది.
అయితే.. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో తనకు అవకాశం వచ్చిందన్న టాక్ వినిపించింది. సైరా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు చేయబోయే సినిమాకోసం శృతిహాసన్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఆ అవకాశం కూడా చేజారిపోయినట్టే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె పేరుని ఎవ్వరూ లెక్కలోనికి తీసుకోవడం లేదు.
మొత్తానికి లేక లేక ఒక్క సినిమా ఛాన్స్ వచ్చిందనుకుంటే అది కూడా అందని ద్రాక్ష లాగా చేజారిపోవడం నిజంగా విడ్డూరమే. దీంతో.. శృతిహాసన్ ఇక తెలుగులో దుకాణం సర్దేసినట్టే అని సినీ వర్గాల సమాచారం.