బాలీవుడ్‌లో క్వీన్‌గా ఎదిగి, ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న కంగనారనౌత్ త్వరలో రాజకీయాల్లో అడుగుపెట్టనుందా.? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. చాలా రాజకీయ పార్టీలు ఇప్పటికే కంగనాని పాలిటిక్స్‌లోకి ఆహ్వానిస్తున్నాయట. అయితే ప్రస్తుతం తన దృష్టి సినిమాలపైనే ఉందని అంటోంది కంగనా. కంగనాకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లేకపోలేదు. ఆమె తాతగారైన సర్జు సింగ్ రాజ్‌పుత్ హిమాచల్ ప్రదేశ్‌లో పొలిటికల్ లీడర్‌గా సేవలందించినవారేనట.
సో ఆ వారసత్వం అంది పుచ్చుకుంటే కంగనా కూడా రాజకీయాల్లో సత్తా చాటగలదు. కానీ అందుకు కాస్త టైముందంటోంది. అయితే రాజకీయాల్లోకి వస్తే స్వేచ్ఛను కోల్పోవాల్సి వస్తుందని కంగనా చెబుతోంది. ఏదో ఒక పార్టీ సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి ఉండాలి. అన్ని పార్టీల గురించి మాట్లాడే అవకాశం కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే, ఇప్పటిలానే నిస్వార్ధంగా, ముక్కుసూటిగా ఉంటానని చెబుతోంది కంగనా. అయితే కంగనా మెంటాల్టీ రాజకీయాల్లో పని చేస్తుందా.?
మరీ అంత ముక్కుసూటితనం ప్రత్యక్ష రాజకీయాల్లో పనికి రాదు కదా. ఏమో సినిమాల్లో క్వీన్ అయిన కంగనా భవిష్యత్తులో రాజకీయాల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా చక్రం తిప్పగలదేమో. ఇక ఇటీవల 'మణికర్ణిక' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగనా, త్వరలో జయలలిత బయోపిక్ 'తలైవి'తో తమిళ ప్రజలు అమ్మగా కొలిచే జయలలిత పాత్రలో ప్రేక్షుల్ని అలరించనుంది. ప్రముఖ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. హిందీలో 'జయ' టైటిల్‌తో ఈ సినిమాని విడుదల చేయనున్నారు.