వెంకీ - రానా కాంబో.. నిజ‌మెంత‌??

మరిన్ని వార్తలు

మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల‌కు పెట్టింది పేరు వెంక‌టేష్‌. `ఎఫ్ 2`తో ఆయ‌నో సూప‌ర్ హిట్‌ని కూడా అందుకున్నారు. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌తో క‌ల‌సి `వెంకీ మామ‌`లో న‌టిస్తున్నారు. ఈలోగా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కి వెంకీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని వార్త‌లొచ్చాయి. ఈసారి ఆయ‌న రానాతో క‌ల‌సి న‌టిస్తున్నార‌ని చెప్పుకున్నారు. ఈ సినిమాకి వీరూ పోట్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

 

అయితే.. ఈ కాంబో ప‌ట్టాలెక్కుతుంద‌న్న వార్త ఉత్తిదే అని తేలింది. ఇటీవ‌ల వీరూ పోట్ల వెంకీకి ఓ లైన్ వినిపించాడ‌ట‌. కానీ... వెంక‌టేష్‌ మాత్రం ఇంకా ఏ నిర్ణ‌య‌మూ తీసుకోలేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఫ్లాప్ ద‌ర్శ‌కుల‌కు వెంకీ ఛాన్స్ ఇచ్చేలా లేడు. వెంకీ - రానాల కోసం సురేష్ బాబు ఓ క‌థ‌ని సిద్ధం చేయిస్తున్నారు. ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది తేల‌లేదు. కొన్ని ప్ర‌తిపాద‌న‌లు వచ్చినా అవి ఫైన‌ల్ అవ్వ‌లేదు. సో.. ఈ కాంబినేష‌న్ అనేది కేవ‌లం ఊహాగానాలే అని తేలిపోయింది. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS